విశ్వనాథసత్యనారాయణ , "రావూరిభరద్వాజ- వర్థంతి - పద్యాంజలులు"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467
 01.
తే.గీ.
ప్రథమజ్ఞానపీఠమునొందెప్రథితయశుడు
విశ్వకీర్తినిపొందినవిమలయశుడు
పెక్కురచనలురచియించెప్రేమమయుడు
"విశ్వనాథునినుతియింతువేనవేల"!!!

02.
కం.
కవిసామ్రాట్టుండతడే
కవిలోకమునేలినట్టికవితాశరథీ
కవులకుస్ఫూర్తినినొసగిన
కవితిలకుడు"విశ్వనాథ"గౌరవమొందెన్!!!

03.
కం.
రావూరిభరద్వాజుడు
భావావేశంబుతోడపలువిధరచనల్
ప్రావీణ్యతతోవ్రాసియు
సేవించెనుతెల్గువాణిశ్రేష్ఠతమీరన్!!!

04.
తే.గీ.
కష్టములనెన్నొయెదురించికవిగమారి
మనిషితత్త్వమ్మునెఱిగియుమానవతను
రచనలందునచొప్పించెరమ్యమలర
భవ్య"రావూరి"సుకవికిప్రాంజలింతు!!!
కామెంట్‌లు