01.
కం.
పదిమందికిసాయపడుము
పదిమందికిఅన్నమింతపంచుముదినమున్
పదిమంచిమాటలునుడువు
పదిమందియుమెచ్చునటులపనిజేయుమయా!!!
02.
కం.
మంచిపనులెన్నొజేసియు
మంచితనంబునమసలియుమంచినిపెంచన్
మంచితనమ్మిలదైవము
మంచియెకాపాడుచుండుమహిమాన్వితమై!!!
03.
కం.
మంచితనమ్మునుమరువకు
మంచితనమ్మునువిడువకుమంచిధనమదే
మంచితనమ్మునుజూపియు
మంచితనముతోమెలిగినమాన్యతపెరుగున్!!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి