01.
కం.
అమ్మానాన్నలుజన్మను
సమ్మతముగనిచ్చినట్టిసాక్షాత్దైవాల్
ముమ్మారులుసేవించియు
నమ్మికతోగొల్వరండినందముగల్గున్!!!
02.
కం.
కనిపెంచినపుణ్యాత్ములు
వినవలెగావారిమాటవిధిగానెపుడున్
మనసులుబాధించవలదు
మనమేకొండంతబలముమరువకుసుమ్మీ!!!
03.
కం.
కష్టముకల్గించవలదు
నష్టముతలపెట్టరాదునడవడియందున్
నిష్ఠగపనులనుజేసియు
యిష్టముతోనున్నజూచియెంతోమురియున్!!!
04.
కం.
పల్లెత్తుమాటలనకను
తల్లీదండ్రులకొరకునుతపియించవలెన్
ఎల్లావేళలవారికి
యుల్లమురంజిల్లునట్లునుండినశుభమౌ!!!
05.
కం.
దండముఅమ్మానాన్నకు
దండమునిస్వార్థరహితత్యాగధనులకున్
దండముజన్మకుజన్మకు
దండముదండంబుజేతుధన్యంబనుచున్!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి