"నవదుర్గామాతస్తుతి-పద్యాంజలి"!!!:-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి :- 6300474467
 01.
శా.
రా! రాజేశ్వరిదేవినిన్నుగొలుతున్ రమ్యాతిరమ్యమ్ముగన్
లేరేనీసరిదైవమంచుభువిపైలేరమ్మవేరెక్కడన్
ప్రేరేపింతువునిన్నునమ్ముకొనగా ప్రేమారదీవించి,నిన్
జేరన్మార్గముజూపుమమ్మశుభదాచిన్ముద్రరూపీసతీ!!!
02.
ఉ.
అమ్మలగన్నయమ్మముగురమ్మలమామురిపాలకొమ్మవై
యిమ్మహినేలుచుండిమమునిష్టముచేతనుకాచుచున్న,దు
ర్గమ్మవునివ్వగన్ శుభమురాగదెభక్తిగనిన్నువేడెదన్
కమ్మనిపద్యవిందులనుకాన్కగనిత్తునుస్వీకరించవే!!!
03.
తే.గీ.
"సర్వమంగళరూపిణీసాకుమమ్మ"
"సర్వజగద్రక్షవరదాయిశాంతమొసగు"
"సర్వకళలకురూపమ్ముసాక్షినీవె"
"సర్వపాపసంహారిణీశరణుశరణు"!!!

కామెంట్‌లు