1.
అమ్మను నీవు ప్రేమించు
నాన్నను గౌరవించు
గురువును నీవు పూజించు
నీ భవిత కాంక్షించు
2.
సైనికుడి రక్షణను
కాదనలేని నిజమేను
రుణపడుదాం జగములోను
జోడించుదాం చేతులను
3.
దేశానికి రైతే రాజు
ప్రజల యందు మారాజు
దేశ భుక్తి తీర్చురాజు
జీవితాల వీర రాజు
4.
తల్లిదండ్రుల త్యాగము
దైవంతో సమానము
పాదాభివందనము
అందరికి ఆదర్శనము
5.
అందరం చదువుదాం
గమ్యాన్ని తెలుసుకుందాం
విజయాన్ని జయించుదాం
పెద్ద స్థాయికి ఎదుగుదాం
6.
పచ్చనైన ప్రకృతి
ప్రజల యందు సంస్కృతి
ఆకుతో పచ్చని రీతి
అదే మన వాయు సోపతి
7.
సమయo విలువ తెలుసుకో!
శ్రమను నీవు నమ్ముకో!
సాధించి చూపెట్టుకో!
కష్టేఫలి అని అనుకో!
8.
బడి మన చదువుల గుడి
గుడి అంటే అమ్మ ఒడి
అక్షరాలు నేర్పే మడి
దైవంలాంటి మనబడి
9.
పచ్చని రకాల చెట్టు.
ప్రగతికి మంచి మెట్టు.
చెట్లను నాటుదాం పట్టు.
మనకు హాని కలగనట్టు.
10.
అందం చూసి మెరవకు.
సుఖం చూసి మురువకు.
దుఃఖం చూసి ఏడవకు.
చెడు వైపుకు నడవకు.
11.
అందమైన పిల్లలం.
అందరి చిరు నవ్వులం.
మంచి కోరు మల్లెలం.
అందరిపట్ల పువ్వులం.
12.
మా ఇల్లే అందము.
మమతలకే నిలయము.
అందరితో స్నేహము.
ప్రశాంతమైన ఆలయము.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి