అందమైన పండుగ;-డా|| బాలాజీ దీక్షితులు పి.వితిరుపతి8885391722
 కన్నె పావురాలు
ఉయ్యాలలక్కి ఊగుతున్నాయి... అందంగా !
ఉట్టిపడే తెలుగుతనపు
చిలుకలు బంగారు కోయిలలై పాడుతున్నాయి...మురిపెంగా!
సౌభాగ్య సంపదలకై
చంద్రోదయ కళలకై
అనురాగ సుఖాలకై
గర్భస్థదోష నివారణకై
మనసున్న మనిషితో మనువుకై
గోరింట పులుముకుని
గౌరిదేవిని పూజించేను ముద్దుగుమ్మలు...భక్తి పరవశంగా !
వాయనాలు 
ఉపవాసాలు
ఫలోపహారాలు
ప్రకృతి ఆహారాలు
పసుపు , తాంబూలాలు
అట్లతద్దోయ్ ... ఆరట్లోయ్ అనికొలిచే 
ఆడవారి అందమైన పండుగ
అందాలతో మన ఇల్లే నింపగ
వచ్చేను ఆశ్వీజ అట్లతద్ది


కామెంట్‌లు