త్యాగం! అచ్యుతుని రాజ్యశ్రీ 8985035283
 పురాణాలు రామాయణం భారతాలలో చదివాము త్యాగం గురించి. మనకి ఉన్న దాంట్లో పంచి పెట్టడం పంచుకుని తినటంవేరు.ఇది రక్త సంబంధం ఉన్న  కుటుంబం  ఆత్మీయులైన మిత్రుల మధ్య జరుగుతుంది. శిబి దధీచి జటాయువుల కధ మనందరికీ తెలుసు. కానీ దేశభక్తి రాజభక్తితో తమ జీవితాన్ని బలిచేసిన చరిత్రలో మిగిలారు.అందలో రాజపుత్ర దాసి పన్నాదాయి త్యాగం అపూర్వం. రాకుమారుడి ప్రాణరక్షణకై తన కొడుకునే బలి ఇచ్చిన ఆవీరమాత చిరస్మరణీయురాలు.తన కళ్ళెదుట తన చిన్నారి పాపడిని కత్తితో నరికితే భరించిన ఆకన్నతల్లిని తలుచుకుంటే ఏడ్పువస్తుంది.హిందీ సాహిత్యంలో ఆమెని అపూర్వ 
దేవతగా చూపారు.మేవాడ్ రాజుని బనవీర్ అనే దుర్మార్గుడు చంపి ఆయన చిన్నారి కొడుకు ఉదయసింహుని చంపాలని పన్నా దాది ఇంటికి  బైలుదేరాడు. పన్నాకి ఈవిషయం ముందే తెలుస్తుంది. సరిగ్గా అదే వయసు ఉన్న తన చిన్నారి కొడుకు చందన్ కి రాకుమారుడి దుస్తులు వేసి ఊయలలో నిద్రపుచ్చింది.ఉదయసింహుని కి తన కొడుకు దుస్తులు వేసి రోజూ కోటలోకి విస్తరాకులు  పళ్లు పూలు తెచ్చే దాసి బుట్టలో పడుకోబెట్టి  కోటని దాటించింది.ఆదాసి ఉదయుని సురక్షితప్రాంతంకి చేర్చింది. దుర్మార్గుడైన బనవీర్  పన్నా ఇంటి కి వెళ్ళి ఊయలలో ఉన్న  చందన్ ని కత్తితో  నరకాలని వస్తే ఆమాతృమూర్తి బతిమాలుతుంది"పసివాడైన రాకుమారుడిని చంపకు"అని వేడుకున్నా దుర్మార్గుడు  చందన్ ని నరికి  గర్వంగా వెళ్లి పోతాడు. తన కొడుకు ని బలిఇచ్చి  ఉదయసింహుని మేవాడ్ రాణాగా నిలబెట్టిన పన్నా దాయి త్యాగం అపూర్వం.
ఇకమహా మంత్రి తిమ్మరుసు త్యాగం అపూర్వం. శ్రీకృష్ణ దేవరాయలు ఎంత కీర్తిప్రతిష్ఠలు సంపాదించినా  తనను కాపాడిన తిమ్మరుసు నే అనుమానించాడు.ఘోరమైన నేరంతో కృశించాడు. ఒక బీద బ్రాహ్మణ కుటుంబం లో పుట్టిన  ఆయన చరిత్ర మరుగున పడింది. ఆయన సోదరుడు  గోవిందుడు.బాల్యంలోనే అమ్మా నాన్నలు చనిపోటంతో అనాధలుగా పెరిగారు.తిమ్మరుసు  మహా చురుకైన వాడు. బంధువుఐన చిట్టి గగ్గన్న చంద్రగిరి రాజు దగ్గర మంత్రిగా ఉంటూ తిమ్మరుసుని తీర్చి దిద్దాడు.బాలుడైన తిమ్మన ఒక రోజు చెట్టు కింద నిద్రపోతుంటే ఒక పాము పడగవిప్పి నీడ నివ్వటం ఒక సాధువు చూశాడు. "నాయనా!నీవు భవిష్యత్తులో ఒక మహా సామ్రాజ్యానికి సూత్రధారివి బీజంగా భాసిస్తావు"అని ఆశీర్వదించాడు.తెలుగు కన్నడ సంస్కృత పార్శీభాషలలో పండితుడైన తిమ్మరుసుని గూర్చి తెలీక పోటం మన దురదృష్టం. విజయనగర సామ్రాజ్యంకి మహామంత్రి గా  ఎన్నో పరీక్షలు నెగ్గిన మహామేధావి ఆయన.నరసింహరాయలు  శ్రీ కృష్ణ దేవరాయలను చంపమని తిమ్మరుసు ని ఆజ్ఞాపించాడు. ఆయన కృష్ణరాయల ని కాపాడి మేకకళ్లను ఆనవాలుగా చూపాడు.కానీ చెప్పుడుమాటల ప్రభావంతో తన కొడుకు కి తిమ్మ రుసు విషం ఇచ్చి చంపాడు అని కృష్ణ రాయలు తిమ్మ రుసుకనుగుడ్లు పీకించటం అమానుషం! తన తప్పు తెలుసు కున్న రాయలు ఎంత ఏడ్చినా ఏంలాభం?రాయలను క్షమించి తిమ్మరుసు ప్రాణం వదిలాడు. అది తలుచుకుంటే మన గుండె చెరువు అవదూ?భువనవిజయం అనే కళాభవనాన్ని నిర్మించినవాడు మహామంత్రి తిమ్మరుసు అని మనకి తెలీదు. ఆయన త్యాగం అనుపమానం.ఇలాంటి త్యాగధనులు నేటికీ ఉన్నారు. వారి సంతానం  చెప్పుకోదు.వజ్రోత్సవ వేళ మన స్వాతంత్ర్య యోధులను తలచుకోవాలి.

కామెంట్‌లు
Popular posts
నిశ్శబ్ద కోరిక : - D.రసన్య,10వ తరగతి, తెలంగాణ మోడల్ స్కూల్, ఘన్పూర్ (స్టేషన్), జనగామ (జి)
చిత్రం
అణిమ - మహిమ -------------------------------- అష్ట సిద్ధులు అనే మాట ఆనోటా ఈనోటా వింటూ ఉంటాం. ఇంతకూ ఆ అష్ట సిద్ధులు ఏంటో తెలుసా? అణిమ, మహిమ, లఘిమ, గరిమ, ప్రాప్తి, ప్రాకామ్యం, ఈశత్వం, వశిత్వం - ఈ ఎనిమిదింఃఇనీ అష్టసిద్ధులు అంటారు. ఈ ఎనిమిది సిద్ధులు సామాన్యమైనవి కావు. వేటి ప్రానాన్యం వాటివే. వాటిలో మొదటిదైన అణిమ అంటే శరీరాన్ని అతి చిన్నదిగా చేసుకోవడం. మహిమ అంటేనేమో శరీరాన్ని పెద్దదిగా చేసుకోవడం. ఈ రెండింటినీ సాధించిన వాడు ఆంజనేయుడు. సీతాన్వేషణ సమయంలో ఆంజనేయుడు ఈ రెండు సిద్ఝులనూ ఆచరించి చూపాడు. లంకలో ప్రవేశించినప్పుడు, సూర్యాస్తమయం తర్వాత పిల్లి అంత చిన్నవాడిలా మారిపోయి ఆశ్చర్యకరమైన రూపాన్ని పొందాడు. వృషదంశకమంటే పిల్లి. అలాగే, ఆకాశమంత ఎత్తుకు ఎదిగి సముద్రాన్ని దాటేటప్పుడు మహిమ సిద్ధిని ప్రదర్శించాడు. ఆంజనేయుడి బలపరాక్రమాలను తెలుసుకోవాలనుకున్న దేవతలు దక్షప్రజాపతి కుమార్తె అయిన క్రోధవశకు జన్మించిన నాగమాత సురసాదేవిని కోరారు. అంతట సురసాదేవి రాక్షస దేహం ధరించి "దేవతలు నిన్ను ఆహారంగా సమర్పించారు. నా నోటిలోకి ప్రవేశించు" అని అడుగుతుంది. అప్పుడు 80 యోజనాల భారీకాయుడైన హనుమ కోసం 90 యోజనాల నోరు తెరిచిన ఆ సురసాదేవి నోట్లోకి ప్రవేశించి, ఆమె నోరు మూసే లోపల, బొటన వేలడంతవాడై బయటకు వచ్చేశాడు. అదీ హనుమంతుడి శక్తి!! - యామిజాల జగదీశ్
చిత్రం
తల్లి గర్భము నుండి ధనము తేడెవ్వడు--ఎం బిందుమాధవి
చిత్రం
మహాభారతంలో వింత పేర్లు.డా.బెల్లంకొండనాగేశ్వరరావు. (నేడు సుబ్బారావు.శంకరరావు పేరు పలువురికి ఎలాఉన్నాయో నాటి కాలంలో కూడా ఒకే పేరు పలువురికి ఉండేది.పురాణలపట్ల ఆసక్తి, అవగాహన కోరుకునేవారికొరకు ఈవ్యాసం.) మహాభారతంలో రమారమి 1655 ప్రాత్రలు మనకు కనిపిస్తాయి. 'అజుడు'దశలధమహారాజు తండ్రి.మరో'అజుడు'పాండవులతరపున యుధ్ధంచేసినరాజు అతిరథుడు.(భీష్మపర్వం)అలాగే నలుగురు 'అనువిందులు'1.దుర్యోధనుని తమ్ముడు (ఆదిపర్వం) 2.సహాదేవుని దక్షణదిగ్విజయ యాత్రలో ఓడిన రాజు(సభాపర్వం) 3.కేకేయరాజు (భీష్మపర్వం)4.కౌరవల తరపున పోరాడిన అవంతీశ్వరుడు. (ఉద్యోగపర్వం)ముగ్గురు 'అలంబసులు' 1.జటాసురునికుమారుడు. (ద్రోణపర్వం)2.బకాసురునిసోదరుడు.(ద్రోణపర్వం) 3.ఒకరాజుయుద్ధంలో 14.రోజు సాత్యకిచేతిలోమరణించారు.(ద్రోణపర్వం)ఇద్దరు 'అశ్మీకుడు'లు 1అభిమన్యునిచేతిలో మరణించినకౌరవుడు(ద్రోణపర్వం) 2.ఇక్షాకు వంశరాజు,కల్మషపాదుని కుమారుడు.(ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రశ్రవశుడు' 1.దుర్యోధనుని తమ్ముడు(ఆదిపర్వం) 2.వ్యాసమహర్షి శిష్యుడు. (ఆదిపర్వం)ఇద్దరు 'ఉగ్రసేనుడు'1.జనమజేయునితమ్ముడు(ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ఇద్దరు 'ఉగ్రాయుధుడు' 1.పాంచాలకుమారుడు (కర్ణ) 2.దుర్యోధనునితమ్ముడు. (ఆది)ఇద్దరు 'ఉత్తరలు'1దక్షునికుమార్తే (ఆది) 2.వరాటమహారాజు కుమార్తె (విరాటపర్వం)ఇద్దరు 'బుచీకకులు'1.ఔర్యునికుమారుడు. (ఆది) 2.దేవాతిథి కుమారుడు.(ఆది)ఇద్దరు 'కపిల'1.కస్యపునిభార్య. (ఆది) 2.గోవు.(ఆది)ఇద్దరు 'కర్ణులు'1.కుంతికుమారుడు. (ఆది) 2.దుర్యోధనుని తమ్ముడు.(ఆది)ముగ్గురు 'గాంధారీలు'1.కౌరవులతల్లి.(ఆది) 2.అజమీఢుని కుమార్తె(ఆది) 3.కుమారస్వామి కొలువులో దేవాంగన (అరణ్య)ముగ్గురు'గోపతి'లు 1.తపుడు అను వహ్ని పుత్రుడు. (అరణ్య)2.మయసభకు వెళ్లిన ఋషి.(సభా) 3.శిబి మనవడు.(శాంతి )ముగ్గురు 'ఘృతాచి'లు.1.అప్సరస.(ఆది)2.ఛ్యవనుని కోడలు.(ఆది)3.కశ్యపునిభార్య. (ఆది)ముగ్గురు'చంద్రసేనుడు'లు 1.శల్యుని చక్రరథికుడు.(శల్య)2.ద్రౌపతి స్వయంవరంకి వచ్చినరాజు. (ఆది)3.భీముని దిగ్విజయ యాత్రలో ఓడినరాజు. (సభా)ముగ్గురు 'చిత్రుడు'లు 1.పాంచాలరాజు.2. చేధిరాజు.(కర్ణ)ఇద్దరు 'చిత్రరథులు'1.ద్రుపద సంజాతుడు అయిన వీరకేతుని పుత్రుడు. (ద్రోణ)2.రేణుకాదేవి కి నీళ్లవద్ద కనిపించిన వాడు.3.అంగరాజు. (అరణ్య)ముగ్గురు'చిత్రవర్మ'లు1.వీరకేతుని పుత్రుడు. (ద్రోణ) 2.దుర్యోధనుడి తమ్ముడు.(ఆది)3.విరూపాక్ష అంశంతో జన్మించినవాడు. (ఆది)నలుగురు'చిత్రసేనులు'1.కర్ణుని చేతిలో మరణించిన పాండవవీరుడు. (కర్ణ)2.ఘోషూయాత్రలో దుర్యోధనుని బంధించినవాడు.(అరణ్య)3.కర్ణ తనయుడు.నకులునిచేతిలో మరణించాడు.(శల్య)4.పాండవ వీరుడుశ్రుతకర్మ చేతిలోమరణించాడు. (కర్ణ)(మిగిలినవి మరో పర్యాయం.)
చిత్రం
తెలుగు సాహిత్యం-శివ కవులు-- బెహరా ఉమామహేశ్వరరావు--సెల్ నెంబర్: 9290061336.
చిత్రం