ముత్యాలహారాలు:-కాట్రావత్ దివ్య 9వ తరగతిZPHS నేరళ్లపల్లి బాలానగర్ మండలంమహబూబ్ నగర్ జిల్లా7013264464

 1.
అక్షరాన్ని నమ్ముకో.
విజయం నీదే అనుకో
గురువు మాటను నమ్ముకో
నీదే ఫలితం అనుకో...
2.
కడుపున మోసిన అమ్మా 
రుణపడిపోయా అమ్మా
నీవే లోకం అమ్మా
నా బలo నీవమ్మా...
3.
గురువులను గౌరవించుము
వారి బాటలో నడువుము
జ్ఞానాన్ని నీవు పొందుము
నీ భవిత బంగారము...
4.
చదువును ఇష్టపడరా
చదువును గౌరవించరా
చదువే నీ బలం రా
చదువు నీ జీవితం రా...
5.
మొక్కలను నీవు నాటుము
చెట్లను ప్రేమించుము
చెట్లకు నీళ్లు పోయుము
చెట్లను కాపాడుము...
     

కామెంట్‌లు