శమీ ఔషధీ గుణం వ్యాసరచన : రస స్రవంతి & కావ్యసుధ9247313488 హైదరాబాద్

 శమీ వృక్షం గొప్ప ఔషధీ వృక్షం. శమీ పాపనాశిని అంటే పాపాలతో కూడిన వ్యాధుల్ని నాశనం చేసే గుణం కలది అని అర్థం. అందుకే శమీ వృక్షాన్ని పూజించడం వల్ల పాపాలు       శమిస్తాయని, వ్యాధుల నాశనంతో పాటు విజయం
కలుగుతుందనే విశ్వాసంతో మన భారతీయ సాంప్రదాయంలో జమ్మి పూజ విశిష్టతను సంతరించుకొన్నది. శమీవృక్షం నూరు సంవత్సరాల జీవితాన్ని స్తుందని మానవుని మనస్సుపై ప్రభావం ఉంటుందని అధర్వణ వేదంలో శమీ సమ్మోహన వశ్య ప్రభావం కలదని దత్తాత్రేయ తంత్రంలో తెలుపబడినది. శమీ వృక్షం రసంలో సర్వ లోహాలు, బంగారం కూడా భస్మము అవుతాయని రస తంత్రాల్లో వివరించబడింది. శమీపత్రాలు తుమ్మ ఆకులను పోలి దళసరిగా ఉంటాయి.
         జమ్మి కొమ్మల్లో శర్కర  సదృశ పదార్థముంది. విత్తులు పీత రంజిక ద్రవం ఉంది. ఈ చెట్టు పై బెరడు,ఆకులు, పువ్వులు, కాయలు, విత్తులు  మందుల్లోకి ఉపయోగపడతాయి. చలువ చేసే గుణం గల కారం, చేదు, వగరు, రుచుల్ని కలిగి ఉండి కఫా, దోషాలను నివారిస్తుంది.  అర్షమొలలు, అతిసారం ,కుష్టు రక్త పిత్త,తదితర వ్యాధుల నివారణకు పనిచేస్తుందని ఆయుర్వేద  చెబుతున్నారు. శమీ వృక్షం ఇంతటి మహిమాన్వితమైనది కాబట్టి దసరానాడు శమీ శమయతే పాపం /శమీ శతృ వినాశినీ/ అర్జునస్య ధనుర్ధారీ రామస్య /ప్రియదర్శిని /అనే శ్లోకాన్ని తెల్లని కాగితంపై వ్రాసి పఠిస్తూ వృక్షానికి ప్రదక్షిణలు చేసి , కొమ్మలపై వేసి నమస్కరించి శమీపత్రాలు తీసుకుని "బంగారం"గా భావించి శమీపత్రాలు పెద్దలకు ఇచ్చి పాదాభివందనం చేసి దీవెనలు పొందుతారు.
                   ఆశ్వయుజ శుద్ధ దశమినాడు ఈ పూజ జరిగిన నాటి నుండి నేటి వరకు విజయాలకు ప్రతీక గా విజయదశమినాడు శమీ వృక్షాన్ని పూజించడం ఓ సంప్రదాయంగా వస్తోంది.
కామెంట్‌లు