ఆశ్వయుజ శుక్లపక్ష దశమి నాడు ' విజయదశమి 'అని శ్రవణా నక్షత్రం సాయంత్రం వేళ దేవాలయాలలో "జమ్మి" చెట్టును దేవలతో కలిపి పూజిస్తారు. ఆ రోజు "జమ్మి" పూజ ఎందుకు చేస్తారు? "జమ్మి" అంటే ఏమిటి ? జమ్మి వృక్షం విశిష్టత ఏమిటి ? జమ్మి ని ఎందుకు ఆరాధించాలి ? ఒక్కసారి పరిశీలిద్దాం పదండి.
"శమీ" వృక్షం అంటే 'జమ్మి ' చెట్టు. ఈ వృక్షం ఎంతో పవిత్రమైనది. ఇది దేవలోకం నుండి తెబడిన వృక్షమని,ఈ చెట్టు కింద అపరాజితాదేవి నివసిస్తదట ! ఆ అపరాజితాదేవి విజయ శక్తి. ఈ శమీవృక్ష పూజలు నిర్వహిస్తున్న మాకందరికీ ఇవ్వమని వేడుకుంటూ శమీ వృక్షం కింద నున్న అపరాజితా దేవికి పూజలు చేస్తారు. విజయదశమి నాడు సూర్యాస్తమయంలో జమ్మిచెట్టును అపరాజితాదేవి గా భావించి పూజించి" శమీ శమయతే పాపం / శమీ శత్రు వినాశినీ / అర్జునస్య ధనుర్ధారీ / రామస్య ప్రియదర్శిని ' అని, శమీవృక్షం శత్రువుని ధ్వంసం చేస్తుంది. శమీవృక్షం పాపాన్ని తొలగిస్తుంది. ఒకప్పుడు అర్జునుడు గాండీవాన్ని తన మీద దాచి పెట్టింది. శ్రీ రామునికి తన దర్శనం కారణంగా కథను సుఖాంతం చేసిందని ఈ శ్లోకార్థం.
ఈ మహిమాన్వితమైన శమీవృక్ష కథల్లోకి వెళ్తే మహాభారతంలో పాండవులు అరణ్యవాసం చేసే ముందు తమ ఆయుధాలను జమ్మి వృక్షంపై దాచి మారు వేషాలతో విరాట్ రాజు వద్దకు వెళతారు. ఈ జమ్మిచెట్టుపై దాచిన ఆయుధాలను దేవతల అనుగ్రహం వలన ఇతరులకు సర్పాలుగా కనబడతాయట మళ్లీ ఉత్తర గోగ్రహణ కాలంలో తమ సమయం పూర్తిగా విరాటుడు గోవులను విడిపించడానికి అర్జునుడు ఉత్తరుని సారధ్యంలో యుద్ధానికి బయలుదేరుతూ శమీ వృక్షం మీద తమ ఆయుధాలను తీసుకొని శత్రువులను జయించి గోవులను రక్షిస్తాడు.
వాల్మీకి రామాయణంలో కూడా శ్రీరామచంద్రుడు రావణునితో యుద్ధం చేసే సమయంలో రావణుని తలలు మళ్ళీ రావడం చూసి అయోధ్యకు బయలు దేరేముందు శమీ వృక్ష పూజ వలన విజయం సాధించాడట.
శ్రీ రాముని వంశం లోని పూర్వ చక్రవర్తులలో ఒకరైన రఘువు అనే మహారాజు ప్రపంచాన్నంతా గెలిచి చివరకు 'విశ్వజిత్ ' అనే ఒక యజ్ఞం చేశాడు. ఇది నేతితో హోమాలు చేసే యజ్ఞం కాదు, తన సర్వస్వం ప్రజలకు పంచె ధనయజ్ఞం. ఆ యజ్ఞం చేసి ఆయన పూరి పాక లో నివసించే కుండలో వండుకునే పరిస్థితికి వచ్చాడు. సరిగ్గా అదే సమయంలో " వర తంతువు " అనే మహర్షి వద్ద "కౌత్యుడు " అనే శిష్యుడు విద్యాభ్యాసం ముగించి స్వామి ! గురుదక్షిణ ఏదైనా అడగండి అని చెప్పి మొండిపట్టు పట్టగా గురువు కాదనలేక ఏడుకోట్ల బంగారు వరహాలఇమ్మన్నాడు. అప్పుడు ఆ శిష్యుడు సరాసరి రఘు మహారాజు వద్దకు వచ్చి పరిస్థితిని గ్రహించి వెను తిరుగుతాడు. ఆ రోజు 'ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి.' రఘుమహారాజు కలశం పెట్టి దీక్ష ప్రారంభించాడు. ఆ సమయానికి 'కౌత్యుడు' వచ్చాడు.వెళ్లబోతున్న కౌత్యుడి ని ఆపి మహారాజు ఇలా అన్నాడు. ఓ ముని కుమారా! వెనుదిరిగి వెళ్ళకు నాకు ఎనిమిది రోజులు సమయం ఇవ్వమని ఈలోగా నాకు బదులు నీవు నవరాత్రి దీక్ష నడుపుకోమని, నీ సొమ్ము దశమినాటికి నీకు ఇస్తాను అని చెప్పగా అందుకు కౌత్యుడు అంగీకరిస్తాడు. రఘుమహారాజు ఇంద్రుని మీదకు దండెత్తాడు. ఇంద్రుడు ఓడిపోతాడు. రఘు అక్కడి ధనంతో పాటు పారిజాతం, శమీ వృక్షాలతో సముద్ర మధనంలో పుట్టిన ఔషధులు కూడా భూమికి తెచ్చాడు. తెచ్చి భూమిమీద పెట్టాడు. వెనకాల దేవతలంతా విమానాలతో రాసాగారు. ఓడిపోయిన దేవతలకు రఘుమహారాజు మీద ఏమాత్రం ద్వేషం లేదు. కానీ అతడు గొప్ప ఘనకార్యం చేయబోతున్నాడని ఊహిస్తున్నారు. అది చూడడానికి వచ్చారు. మరి ఆ దేవ విమానాలను భూమి మోయలేదు. గంగా వేగాన్ని శివుని జటాజూటం ఆపి నట్లుగా ఆ విమానాల వేగాన్ని శమీవృక్షం అవలీలగా ఆప గలిగింది. దేవతలు శమీ వృక్షాలను మెట్లుగా చేసుకుని మెల్లగా కిందికి దిగారు.
రఘుమహారాజు సరాసరి కౌత్యుడు వద్దకు వచ్చి కౌత్యుకా నాకు బదులు నీవు దీక్ష పూర్తి చేశావు. ఆ అమ్మవారి దయ వలన వచ్చిన సంపదనంతా ఇదిగో తీసుకో అన్నాడు. దానికి కౌత్యుడు అంగీకరించలేదు. నాకు ఏడు కోట్ల వరహాలే చాలన్నాడు. ఇంద్రుని గెలిచినా రఘుకు ఇక్కడ మాత్రం గెలుపు సాధ్యం కాలేదు. చివరకు రఘు 'దేవేంద్ర నీ సొమ్ము నీవే తీసుకో ' అంటే ఓడిపోయాను కనుక ఆ సొమ్ము నాది కాదు అన్నాడు. అప్పుడు మిగిలిన సంపదనంతా శమీ వృక్షలకు పంచిపెట్టాడు. ఈ వాదన అంతా శమీవృక్ష వనములో జరిగింది. అప్పుడు రఘుమహారాజు "నీ వేరు పాతిన చోట నీరు ఉండుగాక " అన్నాడు. నీ దర్శనం పాపాలను పోగొట్టు గాక, నీ ఆకులు విషాలను హరించు గాక. నీ ప్రదక్షణం వల్ల సంతానం లేని వారికి సంతానం కలుగుగాక అని అన్నాడు. అందువల్ల శమీ వృక్షానికి అంతా ప్రాశస్త్యం వచ్చింది.

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి