ఘన క్రాంతి దాత శాస్త్రీజీ
అక్టోబర్ 2న పుట్టారు ఇద్దరు
కట్టారు స్వదేశీ వస్త్రాల ఖద్దరు !
జై జవాన్ జై కిసాన్ అని
చాటెనుగా మన శాస్త్రీజీ
అహింసే పరమో ధర్మం కని
చెప్పానుగా మన గాంధీజీ !
దేశం కోసం ప్రాణత్యాగం చేశారు
నిందలను అపనిందలనుమోశారు
భరతమాత ముద్దుబిడ్డలు వీరు
భరత జనులెప్పుడు వీరిని మరచిపోరు!
ఘనంగా తాష్కెంట్ సమావేశం నిర్వహించే శాస్త్రీజీ
అఖండ స్వాతంత్రాన్ని అందించే మన గాంధీజీ
దేశం కోసం పోరాటం చేసిన వారు వీరు
విశ్వమందు శాశ్వత స్థానం సంపాదించినారు!
స్వాతంత్ర సమరం సాగించిన శాంతిదూతలు
స్వాతంత్రాన్ని అందించిన మన ప్రదాతలు
అక్టోబరు 2న పుట్టిన మన ఈ నేతలు
భారతీయులు అసలు మరువని విశ్వ విజేతలు !
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి