ఐక్య రాజ్య సమితి ఆవిర్భావం ; భరద్వాజరావినూతల -కొత్తపట్నం జిల్లా -ప్రకాశం 9866203795

 సాహితీబృందావనవేదిక 🦜ప్రక్రియ-సున్నితంరూపకర్త -నెల్లుట్ల సునీత 
*************************** 
2️⃣7️⃣1️⃣)
శాంతి ఒనగూర   అవతరించింది 
ఎన్నోదేశాలను అక్కున చేర్చుకుంది 
విశ్వశాంతి కై చేసింది కృషి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
2️⃣7️⃣2️⃣)
రాజ్యాలమధ్య స్నేహానికి
యుద్ధభయాన్ని నివారించటానికి 
సామాజికాభివృద్ది సమిష్టి కృషికి 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
2️⃣7️⃣3️⃣)
ప్రపంచశాంతి రక్షణకు వేదిక  
దేశాలన్నీఒకటిగా ఉంటాయి ఇక 
ఐకమత్యానికి ఇది ప్రతీక 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
2️⃣7️⃣4️⃣)
దేశాలన్నీ ఒక్కటిగాచేరి 
నిరాయుధీకరణకు ప్రాణంపోసి 
శాంతిమంత్రం స్మరణ చేస్తుంది 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************  
2️⃣7️⃣5️⃣)
పెరుగును  దేశాలమధ్య అవగాహన 
సామరస్యానికి ఏర్పడునొకభావన 
సంక్షోభం వద్దనుకొనుటే లక్ష్యం 
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************   

కామెంట్‌లు