సమయస్ఫూర్తి!అచ్యుతుని రాజ్యశ్రీ

 శివ మంచి చురుకైన 13ఏళ్ల కుర్రాడు. ఈమధ్యనే ఎన్.సి.సి.లో చేరాడు. కరాటే నేర్చుకుంటున్నాడు.15ఆగస్టు రోజు స్కూల్ ప్రోగ్రాం కాగానే  బస్సులో  ఇంటికి బైలుదేరాడు.మూసాపేట దగ్గర చాలా మంది కూలీలు తట్టబుట్టల్తో ఎక్కారు.వారితోపాటు ఓయువకుడు చిన్న సూట్ కేస్ ని  వెనక ఉన్న సీటుకిందపెట్టాడు.బస్సు కిక్కిరిసిపోయింది. చేత్తో పట్టుకుని నించోటం కష్టం. అతను నల్లకళ్లజోడు పెట్టుకున్నాడు.బాగా తూలుతున్న అతనికి దృష్టి దోషం ఉంది అని శివ గ్రహించి జాలిపడ్డాడు.అంతాముసలి ముతక స్త్రీలు ఉండటంతో  ఆయువకునికి ఎవరూ కూచోమని సీటు ఇవ్వలేదు. ఎర్రగడ్డ స్టాప్ రాగానే గబగబా అందరినీ తోసుకుంటూ కిందకి దిగాడు ఆయువకుడు."టికెట్ ఎవరు ఇంకా తీసుకోలేదూ?"కండక్టర్ అరుస్తున్నాడు. బస్సు కదలబోతుండగాశివాదృష్టి ఆసూట్కేస్ పై పడింది. "కండక్టర్ అంకుల్!ఇప్పుడు దిగిన కళ్ళజోడు అన్న  చిన్న సూట్ కేసు తీసుకోటం మర్చి పోయాడు.బస్సు ఆపండి!"శివా అరుపుకి బస్సు ఆగింది. ఆయువకుడు  తూలుతూ కుంటుతూ అడ్డదిడ్డంగా నడుస్తుంటే అంతా చూస్తున్నారు. హఠాత్తుగా అతను రోడ్ క్రాస్ చేసి కుడివైపు గల్లీలోకి వెళ్ళేప్రయత్నంలో ఉన్నాడు. రోడ్ పై కార్లు స్కూటర్లన్నీ అతన్ని పట్టించుకోకుండా పరుగులు తీస్తున్నాయి.కండక్టర్ కి ఏదో అనుమానం వచ్చింది. అందరినీ దింపి పోలీసులకి ఫోన్ చేశాడు. ఇదంతా జరిగే ప్పటికి పావుగంట గడిచింది. అలర్ట్ ఐన పోలీసులు సి.సి.కెమెరాల సాయంతో ఆయువకుడిని గుర్తించి  పట్టుకున్నారు. ఆచిన్న సూట్ కేస్ లో బాంబు ఉందేమో అని అనుమానించారు.బాంబు స్క్వాడ్ రాకతో వాడి బండారం బైట పడింది. ఆయువకుడు డిగ్రీ పూర్తి  చేసి  చెడు అలవాట్లకు బానిసైనాడు.ఒక ఉగ్రవాద ముఠాలో చేరాడు. డబ్బుకి  గడ్డి తినేవాడికి రక్తసంబంధీకులు నేను నావారు అనే భావం ఉండదు.ఇంట్లో వారితో తెగతెంపులు చేసుకుని పోలీసులకళ్లు గప్పితిరుగుతున్నాడు.ఒక సామాన్యుడి లాగా బస్సు ఎక్కి  అంధునిలా నటిస్తూ బాంబు ఉన్న ఆపెట్టెని సీటుకింద పెట్టాడు. శివా చురుకైన దురదృష్టి కండక్టర్ తీసుకున్న నిర్ణయం తో పెనుప్రమాదం తప్పింది.ఆసాయంత్రం ఒక బహిరంగ సభలో డి.జి.పి.వారు ఇద్దరికీ సన్మానం చేశాడు. శివా పేరుని సాహసబాలల ఎంపిక కై పంపటం జరిగింది. మనం అనుక్షణం  అప్రమత్తంగా  ఉండాలి.ఇప్పుడు మనదేశం  లో అంత:శత్రువులు చాపకింద నీరులా ఆక్టోపస్ లా విస్తరిస్తున్నారు.మనం నీతినిజా యితీగా  ఉండాలి. పిల్లలు  కిడ్నాప్ కి గురి అవుతున్నారు.పెద్దలు కూడా బాధ్యత గా వ్యవహరించాలి.
కామెంట్‌లు