ఆనాటి క్రికెట్ క్రీడాకారులు! సేకరణ..అచ్యుతుని రాజ్యశ్రీ

 నవనార్ రాకుమారుడైన రణజిత్ సింహ్ క్రికెట్ ఆటలోమేటి!నెవిలా కార్డెస్ ఇలా అన్నాడు"ఇంకో రణజిత్ ని పుట్టించటం ప్రకృతికే అసాధ్యం!" సింహ్ బంధువు దలీప్ కూడా మంచి క్రికెట్ వీరుడు.అతను కేంబ్రిడ్జ్ లో చదువుకునేరోజుల్లో లైట్ లేకుండా సైకిల్ తొక్కినందుకు జుర్మానా వేశారు. దాన్ని కేంబ్రిడ్జ్ పేపర్ ప్రచురించినది.వెంటనే రణజిత్  ఒక టెలిగ్రాం పంపాడు"మన భారతీయులు  చెత్తపనులు చేసి పేపర్ లోకి ఎక్కుతున్నారు.అలాంటి తప్పుడు పని ఎందుకు చేశావు?"మరినేడో?టీనేజ్ పిల్లలు లైసెన్స్ సెన్స్ లేకుండా స్కూటర్ కారు నడుపుతూ బార్ పబ్ లో గడుపుతూ యాక్సిడెంట్ చేస్తుంటే నోరెత్తని అమ్మా నాన్న లు ఉండటం మన దౌర్భాగ్యం!
ఒకసారి రణజిత్ సెంచరీ చేసి పెవిలియన్ కి రాగానే అంతా కంగ్రాట్స్ చెప్పారు. వారికి థాంక్స్ చెప్పకుండా మంచు గడ్డలతో ఉన్న తన పాడ్ ని చూపాడు. మూడు చోట్ల గాయాలయ్యాయి. ఐనా ఆడి సెంచరీ సాధించాడు.1897లో అతను  ఆస్ట్రేలియా వెళ్లితే అక్కడి సెనేట్100డాలర్ల టాక్స్ పడకుండా ఆర్డర్ పాస్ చేసింది.ఏవిదేశీయుడైనా ఆస్ట్రేలియా ప్రవేశించేముందు టాక్స్ కట్టితీరాలి.అడ్లాయిడ్ తొలి టెస్టులో అతను 189రన్స్ చేశాడు. కానీ ఆస్ట్రేలియా క్రికెటర్ ఎర్నెస్ట్ జోన్స్ పై విరుచుకు పడ్డాడు "నీవు తప్పుగా బాల్స్ వేస్తున్నావు"అని.అందుకే అతను చేసిన స్కోరు కి అంతగా ప్రచారం రాలేదు.గొంతు నెప్పితో బాధ పడుతున్న
రణజిత్ ని ఆస్ట్రేలియన్లు విమర్శించారు. "ఇంక ఆడలేడు.తట్టబుట్ట సర్దుకుపోతాడు"అనిగేలిచేసి అరవటంతో రోషం అభిమానంతో కుతకుత ఉడుకుతూ పడకపై వాలి విశ్రాంతి తీసుకుంటున్న రణజిత్ సరాసరి ప్లేగ్రౌండ్ కి వెళ్లాడు.ఇంగ్లాండ్ తరుఫున ఆడి 195రన్స్ చేసి వారి నోరు మూయించాడు.ఆపై సరాసరి మంచంపై వాలిపోయాడు.సిడ్నీ 3వ టెస్టు మ్యాచ్ రోజు  ఉదయం రణజిత్ కి ఆపరేషన్ ఐంది. కానీ తొలిరోజు 40రన్స్ చేశాడు. ఇక కోలుకున్న అతను186రన్స్ చేసి జేజేలు అందుకున్నాడు.రణ్ జీ మ్యాచ్
 రణ్ జీ బార్ రణ్ జీబ్యాట్  మార్కెట్ లో సందడి చేశాయి.భారత తొలి క్రికెట్ వీరుడు  రణజిత్  20మ్యాచ్  లలో1157రన్స్ చేశాడు. 
   ఇకవినూ మన్కడ్ బొంబాయి జింఖానాలో విసిరిన బంతి ప్రేక్షకుల గ్యాలరీలోకి దూసుకెళ్ళింది. ఒక ఐదేళ్ళ పిల్లాడికి తగిలి స్పృహ కోల్పోయాడు.వెంటనే  మన్కడ్ ఫీల్డ్ వదిలి ఆబాబు దగ్గరకు పరుగున వచ్చి వెంటనే ఆసుపత్రి కి పంపాడు.ఆసాయంత్రం  మ్యాచ్ పూర్తికాగానే ఆసుపత్రి కెళ్ళి ఆబాబు యోగక్షేమాలు విచారించాడు. ఇలాంటి వారి గూర్చి మనం తప్పకతెలుసుకోవాలి.  విజయ్ మర్చెంట్ కెప్టెన్ గా  క్రికెట్ కంట్రోల్ బోర్డు  అధ్యక్షుడుగా ఉన్నాడు.క్రికెట్ నుంచి తప్పు కున్నాక ఒక విలేఖరితో ఇలా అన్నాడు "నీవు నాఅనుభవాలు చెప్పమంటున్నావు.దాని వల్ల లాభం ఏంటీ?కొత్త వారిని గూర్చి రాస్తే ప్రచురించిన వారికి  అతనికి నీకు భవిష్యత్తు ఉంటుంది. కొత్త వారిని  ప్రోత్సహించాలి.మా ఆటలోని లోపాలను ఎత్తి చూపి రాస్తే  కొత్త వారికి  వాటిని సరిదిద్దుకునే ఛాన్స్ ఉంటుంది."తన మిల్లులో పనిచేసే వారికి ఎప్పుడూ అందుబాటులో ఉండేవాడు.ఒక  కార్మికుడు ఫోన్ లో "సార్!నా ఆరోగ్యం బాగా లేదు. నాజీతం లెక్కగట్టి ఇస్తే నా అప్పులు తీర్చి ప్రశాంతంగా కన్నుమూస్తా"అన్నాడు.వెంటనే విజయ్ లెక్కాడొక్కా చూసి  అతనికి  ఏడువేలు పంపాడు. ఇలాంటి  మనుషులు ఇప్పుడు ఉన్నారా?మనం ఆనాటి తరంవారి గూర్చి తెలుసు కుని తీరాలి.
కామెంట్‌లు