మదిలో నీరూపం నిలిచింది
నన్ను ఎంతో కలవర పరచింది
నా గుండెలో ప్రేమ చిగురించింది
నీకోసం అనుక్షణం పరితపించింది.
నీ చూపులలో పున్నమి వెన్నెల కురిసింది
నింగిలోని చందమామ నేల వైపు చూసింది
నీటిలోని కలువ భామ మురిసింది
చెలిని చూసిన నా కళ్ళల్లో మెరుపు మెరిసింది.
మనసులో మాధురానందం కలిగింది
చెలి నవ్వులో ముద్ద మందారం విరిసింది
చెలి బుగ్గలు కెంపులై వాగులై వంకలై నన్ను గిలిగింతలు పెట్టింది
తన నడక నెమలికి నాట్యం నేర్పింది
తన పలుకులు చిలుకపలుకులుగా మాటలతో మంత్రం వేసింది
సన్నని నడుములో నయగారాలు వోలికింది
తన తనువు తాకిన నా మేను పరవశమొందింది.
నా జీవన బృందావనంలో ప్రేయసి ఒక తారలా తారసపడింది
ఆమె లేని నేను లేను నన్ను దోచిన ప్రియురాలు నాకోసమే పుట్టింది
నాకే సొంతం అయింది
అందాల అపరంజి నాకే దక్కింది
ప్రేమ కోసం చెలితో నా మనసే వూగిస లాడింది
మూడు ముళ్లు వేసేలా చేసి నన్ను
తన సొంతం చేసుకుంది
చివరికి ఆమెను పొందిన నా జన్మ దన్యమయ్యింది...

ఆమె ధ్యాసే మనసు...మేను
అల్లాడి వేణుగోపాల్
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి