*మిట్టపల్లి నానీలు*;- మిట్టపల్లి పరశురాములు
శ్రీరంగనీతులు
చెప్పెవారెగా!
దొడ్డిదారినతప్పుడు
పనులుచేసేటోళ్ళు!!

ఎంటికలున్నమ్మ
ఏకొప్పైనా ముడువొచ్చు!
రాజుగారు
చెప్పిందే వేదము!!

చెప్పడంకాదు
చెసిచూపిస్తేనేవిలువ!
కానివన్నీ...
శ్రీరంగనీతులే!!

గుళ్ళో లింగాన్ని
మింగెవాడుంటే!
గుడినే మాయం
జేసే వాడుంటాడు!!
          ***

కామెంట్‌లు