276) రాజ్యాంగ రచనా ప్రముఖుడు
భారతమ్మ ముద్దు బిడ్డడు
దేశప్రధానిగా చేసిన వాడు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************
277)ఉక్కుమనిషిగా పేరొందినవాడు
గుండె ధైర్యాన బ్రతికినోడు
దేశసమస్యలను పరిష్కరించినోడు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************
278)బారిష్టర్ చదువు చదివాడు
భారతరత్న బిరుదు పొందాడు
బర్దోలి వీరుడు పఠేలు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************
279)పునాది వేశాడు దేశాభివృద్ధికి
దేశరక్షణపై పెట్టాడు దృష్టి
అలుపెరుగని మనిషి సర్దారు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
*************************
280)సంస్థానాలను చేసిన ఘనుఁడు
అతడొక నిష్కళంక దేశభక్తుడు
గాంధీజీకి అత్యంత ఆప్తుడు
చూడచక్కని తెలుగు సున్నితంబు.---!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి