భారతీయసాహితీవేత్తల జీవితం లో ఘట్టాలు! అచ్యుతుని రాజ్యశ్రీ

 ప్రసిద్ధ హిందీ కధ నవలారచయిత మున్షీ ప్రేంచంద్ ని ఎవరో అడిగారు"మీజీవితంలో ముఖ్యమైన కోరిక ఏంటీ?"ఆయన జవాబు ఇది"నాఏడ్పుగొట్టుమొహం  దురదృష్టం నించి నన్ను  సదాకాపాడు అని ఆదేవుని ప్రార్ధించుతాను." "మున్షీజీ!మీరు ఎలాంటి పేపర్ పై ఎలాంటి పెన్ తో రాస్తారు?" ఆయన నవ్వుతూ ఇచ్చిన జవాబు ఇది"
పంజాబీ రచయిత్రి అమృతాప్రీతం ఒక అమెరికన్ నవలను అనువాదం చేస్తున్న రోజులవి.డిక్షనరీలో లేని పదాలు అందులో ఉన్నాయి.సహాయంకోసం అమెరికన్ రాయబార కార్యాలయంకి లేఖరాసింది.అక్కడినించి శ్రీహరివంశ్  ఆమెకి డిక్షనరీ పంపాడు. దాని తొలి పేజీలో ఇలా రాశాడు "టూ అమృతాప్రీతం!విత్ ఆల్ గుడ్ వర్డ్స్ ఫ్రం దిస్ డిక్షనరీ " ఆమె ఇలాఅంది"నా సమకాలికులు  చెడుపదాలను ఏరుకుని నాపై ప్రయోగిస్తున్నారు.కానీ మంచి శబ్దాలు వింటానికి అలవాటు పడితే ఏపదంవిన్నా నాచెవులు  మంచినే ఉంటాయి. "ఆమె  తన జీవితం లో ఒక ఘట్టం ఇలా రాసింది."1936లో నా తొలి పుస్తకం అచ్చుఐంది.కపుర్తలా మహారాజా నాకు 200రూపాయలు అభినందిస్తూ పంపారు. నాభామహారాణి ఆపుస్తకంని  ప్రశంసిస్తూ ఒక చీర పంపింది.ఇవి పోస్ట్ లో వచ్చాయి. ఇంకోరోజు పోస్ట్మాన్ తలుపు కొడితే "నాకు ఏమన్నా ప్రైజ్ వచ్చిందా?"అని అడిగాను.మానాన్న కోపంగా నావైపు చూశాడు. ఇలాంటి ఆశ లోభం  కోరిక రచయితలో ఉంటే తనని తాను తక్కువచేసుకున్నట్లే అన్న విషయం నాన్న వల్ల తెలుసు కున్నాను. "
 "పేపర్ పై ఎవరూ ఏమిరాయనిదానిపై పాళీ  నిబ్ విరగని పెన్నుతో రాస్తాను. మేము కలం కూలీలం!"ఆకాలంలో  జీ.నిబ్ పెన్ను తో హోల్డర్లో ఉంచి రాసేవారు. మధ్య మధ్యలో  దానితో  తన నోటి దంతాలను గీరుకునేవాడు.పెదాలు సిరాతో ఉండేవి. అప్పటి యు.పి.ఆంగ్ల గవర్నర్ సర్.మాల్కమ్ హేలీ"నీకు  రాయ్ సాహెబ్ బిరుదు ఇవ్వాలని అనుకుంటున్నా"అని కబురు పంపితే నిరాకరించారు. భార్య కారణం అడిగితే "నేను ఇన్నాళ్ళూ ప్రజల కోసం రాస్తున్నాను. రాయ్ సాహెబ్ ని అయ్యాక ఆంగ్ల ప్రభుతకోసం రాయాల్సి ఉంటుంది. ప్రజలుముఖ్యం"అన్న దేశభక్తుడు ప్రేంచంద్.

కామెంట్‌లు