అక్షర మాల - బాల గేయం ( ప గుణింతం );-ఎం. వి. ఉమాదేవి
 పచ్చని కూరలు ఆరోగ్యం 
పాలు సంపూర్ణ ఆహారం 
పిల్లలకు కథలు ఇష్టం 
పీనాసితనం మంచిదికాదు 
పులి జాతీయ జంతువు
పూల పండుగ బతుకమ్మ 
పృథ్వి ఆకాశం స్నేహితులు 
పెన్సిల్ జాగ్రత్తగా చెక్కాలి 
పేపర్ చదవడం మంచిఅలవాటు
పైరుకు తగినన్ని నీళ్ళుకావాలి 
పొట్లకాయ కూర రుచి 
పోటీపరీక్షలు మంచివి 
పౌర్ణమి రోజు వెన్నెల హాయి!
పంచదార ఎక్కువ వాడరాదు!

కామెంట్‌లు