*గువ్వలచెన్న శతకము* - పద్యం (౦౨౭ - 027)
 కందం:
*చండాల కులుఁ డొసంగిన* 
 *తండులముల బ్రతికినట్టి ధాత్రీశకులుల్*
*నిండుతనం బెరుఁగుదురే?*
*కొండికలఁ జరింత్రు గాక గువ్వలచెన్నా!*
తా.: 
తక్కవ కులము వాళ్లు ఇచ్చిన బియ్యం తినిన వారైన, ఎంతో గొప్పకులములో పుట్టాము అని చెప్పుకునే క్షత్రియులు  సమాజంలో చిన్నతనం తో బ్రతకుతారు గానీ గౌరవం గా బ్రతకలేరు కదా ....అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*పట్టభిరామ కవి ఈ పద్యాన్న తన సమకాలంలో వున్న పరిస్థితులకు అనుగుణంగా వ్రాసివుంటారని నా భావన. అయితే, ఇప్పటి సమాజానికి కూడా ఈ పద్యం అతికినట్టు సరిపోతుంది.  అప్పటి కాలంలో రాజులు, ఇప్పటి కాలంలో ప్రజల మద్దతుతో ఎర్పడిన ప్రభుత్వాల అధిపతులు ప్రజలకు నచ్చిన పాలన ఇవ్వడం లో వెనకపడి వున్నారేమో అని  కవి భావం.  రాజులు ఎవరి ఇంట భోజనము చేశాము అని కాకుండా సమాజంలో అందరికీ మంచి చేసే ఆలోచనతో పనిచేయాలి.  ప్రభువులు, ప్రభుత్వాలు అందరికోసం పనిచేసే ఆలోచనని ఆ పరాత్పరుడు వారికి ఇవ్వాలని చెన్నకేశవుని ప్రార్థిస్తూ...!*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

కామెంట్‌లు