"భారతదేశప్రపథమప్రధానమంత్రిభారతరత్నపండిట్ జవహర్ లాల్ నెహ్రూజీగారి 132 వ జయంతి-బాలలదినోత్సవం-పద్యాంజలి"!!!;- "సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
తే.గీ.
మహినిస్వర్గమ్ముకాశ్మీరమందుపుట్టి
నహరుప్రక్కననున్నంత నెహరువగుచు
భరతజాతికిభూషణప్రాయుడయ్యె
బాలభారతచాచాజవాహరుండు!!!

02.
తే.గీ.
భారతప్రధానిజన్మోత్సవమ్ము నేడు
బాలలదినమనియునేడుబడులయందు
సంబరమ్ములతోడచాచాజిపట్ల
గౌరవమ్మలర్చెన్భావిపౌరులగుచు!!!

03.
తే.గీ.
తీయచాచాజిదివ్యసందేశములను
తూచతప్పకపాటించిఊచముట్ట
భావిభారతగౌరవబాల పౌర
యువతనేతృత్వమేకాన్కజవహరునికి!!!

04.
కం.
పిల్లలమదిలోనిలిచియు
చల్లనిదీవెనలొసంగిశాంతినిపంచెన్
మల్లెలమాదిరినెహ్రూ
నుల్లంబులగెల్చిసతతముర్వినివెల్గెన్!!!

05.
కం.
ఇందిరనాన్నగతానై
సుందరసురుచిరగులాబిశోభనుగూర్చెన్
వందనమొందుచుభారత
నందనవనమందునిలిచినాయకుడయ్యెన్!!!
 

కామెంట్‌లు