"బాలలనీతిపద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
ఆ.వె.
బాలలారమీరుపట్టునువిడువక
చదువవలెనుగొప్పచదువులెన్నొ
చదువువిలువతెలిసిచతురతనిల్పియు
భవితదిద్దుకొనుడుభాసురముగ!!!

02.
ఆ.వె.
సంబరములతోడచదవాలియెదగాలి
సంబరములతోడసాగిపొమ్ము
సంబరములుమీకుసమకూర్చుసిరులను
సంబరములుమీకుసతమురక్ష!!!

03.
 ఆ.వె.
పెద్దవారిమాటప్రేమతోవినవలె
పెద్దవారిమాటపెరుగుసద్ది
పెద్దవారలనగపెన్నిధిసన్నిధి
పెద్దవారలెపుడుపెంచుగుణము!!!

04.
ఆ.వె.
అమ్మనాన్నఅక్కఅనురాగనేస్తాలు
అన్నచెల్లితమ్మిఆప్తగుణులు
వీరితోడునీడదారిజూపునుగదా
కంటివెలుగులయ్యికళలుచిందు!!!


కామెంట్‌లు