దరువు తప్పి తిరుగుతున్న పిల్లలంకరువు కప్పి కరుగుతున్న మల్లెలంబతుకు పరుగు తీస్తున్న వారలంమెతుకు తరుగు చూస్తున్న పోరలంవరద వచ్చి వరి చేను నీటిలో మునిగిందిబురద హెచ్చి బుడ్డచేను బురిడీ కొట్టించిందితినలేక కొనలేక మాకు మెతుకే కరువయ్యిందిసాగలేక వేగలేక ఈ బతుకే ఇక బరువై యింది !మా సర్కారు ప్రకటించే మాకు కరువు సాయంమా తకరారు వికటించి అయ్యె మాకు గాయంకరువు సాయం అందలేక మేం చిన్న బోయి ఉన్నంఉరువు గాయం నయంగాక ఖిన్నులమై పడిఉన్నం !ఈ కరువు సాయం అనలేదు మా కంటికిమా వరద గాయం మానలేదు ఈ ఒంటికిఆదుకుంటాం సాధు కుంటాం అంటారంతాఆదుకుంటే సాదుకుంటే మాకెందుకు చింత !అప్పు ముప్పులు కనుకోక తప్పులు ఎన్నో చేసాంతప్పు డప్పులు వినుకోక ముప్పు లెన్నో చూసాంముప్పు తిప్పలు పడుతూ ముందు దారి కొచ్చాంమెప్పు గొప్పలు చేపడుతు మా విందు కోరిఇచ్చాం !
అప్పు కరువు పిల్లలం;----గుర్రాల లక్ష్మారెడ్డి, కల్వకుర్తి.సెల్.నేం.9491387977.నాగర్ కర్నూల్ జిల్లా.
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి