*కల-నిజం*(కథా మణి పూసలు);--బొమ్ము విమల మల్కాజ్ గిరి 9989775161
రామాపురము ఊరిలో
ఇరుగు,పొరుగున యిళ్ళలో
రంగయ్య,పోలయ్య అనె
రైతులుండె మురిపెములో 

ఒకరోజున ఇద్దరును
మాట్లాడుతూ వారును
సరదాగ నడచుకుంటు
పొలంకి వారు పోతును 

రంగయ్య రాత్రి నాకొక
విచిత్రమైనట్టీదొక
కల వచ్చినదంటూ
పోలయ్యకది తెలిపెనిక 

ఒక బిందెలోనుండిను
పసిడి వర్షం కరిసెను
అనుచును చెప్పినాడు
పోలయ్యకట్టి  కలను 

ఆ కల విన్న పోలయ్య
నాకు వచ్చెను కలనయ్య
అంటు భూమిలో బిందన
 నాణ్యేములు దొరికెనయ్య 

అంటూ హుషారుగాను
పోలయ్య పలుకగాను
కల నిజమైతె బాగుండు
నని వారు పలుకగాను 

భూమి దగ్గరికొచ్చారు
పంటకు నీళ్ళు పెట్టారు
పోలయ్య గడ్డి కోయగ
కూలిలు వరిని కోసారు 

రంగయ్య దున్నుతుండగ
నాగలికేదో తగులగ
బందె అక్కడ ఉన్నది
 బిందెను పోలయ్యదేగ 

అని ఇచ్చుటకు పోయాడు
పోలయ్యకది  యిచ్చాడు
అమాయక రంగయ్యంటు
బిందె యింటికి తెచ్చాడు 

రాత్రి దాన్ని తెరిచాడు
బిందె మూతి విప్పాడు
తేళ్ళు పైకి రాగానే
బిందె మూతి కట్టాడు 

రాత్రి దాకా చూసాడు
ఎవరు లేరని కన్నాడు
ఇంటి పెంకులు తీసి
తేళ్ళబిందెను వొంచాడు 

పసిడి  వాన కురిసెనంటు
రంగయ్యనె ఆరుచుకుంటు
అందరిని లేపగ చూస్తు
పోలయ్యది. కళ్ళుకుంటు 

అక్కడికి చేరాడు
నాణ్యాలు చూసాడు
అయ్యో పిచ్చివాణ్ణి
అంటతను గులిగాడు 

కింద నాణేములుండెను
ఎంతనె మోసపోయాను
సరిగ్గా చూసివుంటే
అవి నాకు వచ్చియుండును 

అనుచు బాధపడుకుంటు
తనను నిందించుకుంటు
అక్కడి నుండి వెళ్ళాడు
తన తప్పు తెలుసుకొంటు 

కల నిజమైన రంగయ్య
ఆనందం పొందెనయ్య
తన పనులు చేసుకొంటు
జీవితమును గడిపెనయ్య 


నీతి

మోసంను చేయవద్దు
అత్యాశ యుండవద్దు
తనని తాను నమ్ముతు
ఉండుటెంతోను ముద్దు 


కామెంట్‌లు