తేట గీతి
బాణ సంచాను కాల్చిరి బాలలెల్ల
తార జువ్వలు,నౌట్లును తప్పకుండ
కాక రపువొత్తి బాంబులు గా ల్చినారు
వెన్న ముద్దులు సొగసుగ వెన్నెలయ్యె
పాము బిళ్లలు బుసబుస పాకివచ్చె
బిళ్ల పిస్తోలు రీలును బీరువోక
చిన్న బాంబులు నులిపాయ చిందులేయ
ఆమతాబుల సందడి నాపలేము
విష్ణు భూచక్రములుతిప్పి విజయమంది
చిచ్చు బుడ్లును చెలరేగ చిన్మయముగ
తాటి యాకుగుమ్మటములు తాము జేసి
వాకిలందున వెలిగించి వనితలెల్ల
తీపి వంటలు జేసిరి తీరికగను
దీప కాంతులు గోడల దివ్య ప్రభలు
గడప కటునిట ప్రమిదలు గాత్రముగను
అమవసనిశియు వెల్గెను నద్భుతముగ!!
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి