నాగుల చవితి - బాల గేయం -ఎం. వి. ఉమాదేవి. నెల్లూరు
నాగుల చవితికి అందరమూ 
అమ్మతో పుట్టకు వెళుతాము 
దీపం పెట్టి మొక్కుతాము 
పిండి, సజ్జలు పంచుతాము!

నాగులచవితికి నాగేంద్రా 
ఒక్కపొద్దుoటాము ఫణిరాజా 
జ్ఞానం,చురుకు మాకివ్వు 
దాన హృదయం దయనివ్వు 

ఋతువుల్లోని పండుగలు 
ఋజువులు గాను పద్ధతులు 
ఉపయోగంగా ఉంటాయి 
ఉత్సాహమును ఇస్తాయి !!


కామెంట్‌లు