పాము-డేగ! అచ్యుతుని రాజ్యశ్రీ

 సముద్రపు ఒడ్డున ఒక గుహలో పాము ఉండేది. అలలహోరు వింటూ అనుకునేది"నాకు ఎలాంటి భయంలేదు .నాగుహలో నేనే రాజుని. "ఒక రోజు హఠాత్తుగా ఒళ్లంతా గాయాలై రక్తం ఓడుతున్న డేగ  గుహదగ్గర  నిస్సహాయంగా వాలింది. మొదట్లో భయపడినా పాము నెమ్మదిగా గుహలోంచి పాకుతూ బైటికి వచ్చి  ఆడేగను సమీపించింది."ఏంటీ!చావుబతుకుల మధ్య పోరాడుతున్నావా?" "డేగ అంది"అవును!ఇన్నాళ్లు స్వేచ్ఛగా అన్నిప్రాంతాలకి ఎగిరాను.ఆకాశంలో హాయిగా విహరించాను." "ఏంటీ  ఆకాశమా?అక్కడ ఏముంది?నాగుహలో హాయిగా సుఖంగా ఉన్నాను.పాకటం ఎగరటంలో ఏంటీ భేదం?హు..ఎగిరి దెబ్బలు తిని నేలపడిన నీవు ఎలా గిలగిలలాడుతున్నావో?"ఎకసక్కెంగా అంది పాము. ఒక్క సారి  డేగ గుహలోకి తొంగి చూసింది. లోపలంతా చీకటి గబ్బువాసన!"డేగా!ఈబండపైనించి నీరెక్కలువిప్పి ఎగిరే ప్రయత్నం చేయి."సలహా ఇచ్చింది పాము. ఆ మాటలతో ఓపిక తెచ్చుకొని ఎలాగో కొంచెం దూరం ఎగిరింది.ఎగిరే శక్తి లేక పాపం జలజలపారే నదిలో పడి పోయింది. ఆనీటిలో తపతప కొట్టు కుంటూ ఉండగాపెద్ద పెద్ద  అలలు వచ్చి డేగను ఈడ్చుకుని పోయాయి.పాము ఆకాశంవైపు చూస్తూ ఆలోచన లోపడింది."ఆడేగ నిస్సహాయస్థితిలో కూడా  ఆకాశంని గూర్చి  ఆలోచించింది.నేను కూడా ఒకసారి ఆకాశంలోకి ఎగరగలిగితే ఎంత బాగుంటుంది?" పాము తన శరీరాన్ని బాగా ముడిచి ఒక్క సారిగా పైకి ఎగిరింది. కానీ ధబ్ మని అక్కడే బండపై పడింది. "హు!పక్షులు ఎంత మూర్ఖజాతివో!?భూమి పై హాయిగా పాకుతూ గుహలో చీకుచింతలేకుండా బతకడం లో ఎంత సుఖం రక్షణ ఉన్నాయో?ఆకాశం అంతా శూన్యం!నిలువనీడలేదు.పిచ్చి డేగ!ఎగిరి ఎగిరి ఏంబావుకుంది?ప్రాణాలకే ముప్పు తెచ్చుకుంది.  "ఆలోచన లో మునిగిన  పాముకి నీటి నుంచి కమ్మని స్వరం వినపడుతుంది. సూర్యుడి బంగరు కాంతిలో నది అలలపై కమ్మని గానంతేలితేలి వస్తోంది. అలలు హాయిగా గొంతు విప్పి  పాడసాగాయి"మేమంతా పాడుతాం!సాహసికుల ధీశాలుల  కొనియాడుతాం!ప్రాణం ని పణంగా పెట్టేవారు జీవితకష్ట నష్టాలు తృణప్రాయంగా చూసేవారు! దేశం కోసం  జాతి కోసం పరుగులు పెట్టేవారు !లక్ష్యసాధనలో దూసుకుపోయేవారు మాకు ఆదర్శం!ఓడేగా!రక్తపు ధారలు ఓడుతూ రెక్కలు తెగినా
తెగువ చూపే నీధైర్యం మాకు ఆదర్శం!నీతపనకు మా జోతలు!"పాము సిగ్గు తో  తల వేలాడేసి గుహలోకి పాకుతూ పోయింది.
కామెంట్‌లు