వీర దుర్గాదాస్. అచ్యుతుని రాజ్యశ్రీ

 రాజపుత్రులు కేవలం యుద్ధంలోనే కాదు మామూలు జీవితంలో కూడా తమ బుద్ధి చాతుర్యం చూపేవారు.జోధ్పూర్ రాజు కిచెందిన ఆడ ఒంటెను ఎవరో చంపారని సేవకుడు నివేదించాడు.అసకరణ్ అనే వ్యక్తి ని బందీగాపట్టుకుని రాజు ముందు నిలిపారు."రాజా!నా12ఏళ్ళ కొడుకు  తెలీక మీఒంటెను చంపాడు. "  "ఏంటీ!నీకొడుకుపై నేరాన్ని  నెట్టేస్తున్నావా?సరే వాడిని ఈడ్చుకుని రండి."రాజు ఆజ్ఞాపించాడు. ఆపిల్లాడు ఎంతో నిర్భయంగా రాజు ఎదురుగా నిలబడ్డాడు. "ఏంరా!కుర్రకుంకా! నా ఆడ ఒంటెను చంపావు కదూ?" "చిత్తం ప్రభూ!" "ఎందుకు అంతసాహసం చేశావు?అది నేరంకాదా?"  "ప్రభూ! రెక్కాడితేగాని డొక్కాడని రైతులం!మీ ఒంటెలనుమేపేవాడు రోజూ మాపొలం మధ్యలోంచే ఒంటెలను పరుగెత్తిస్తుంటాడు.మాపొలం వాటికాళ్ల తొక్కిడికి  నాశనం అవుతుంటే చూస్తూ ఊరుకోమంటారా?పైగా అవి మాపైరుని కరకరా నమిలి తింటున్నాయి?మాచెమటోడ్చి విత్తు లేసి సాగుచేస్తున్నాము.మాపొలం నాశనం అవుతోంది అని ఎంత చెప్పినా  అతను వినకపోటంతో నేనే చంపాను ప్రభూ!" ధైర్యం గా చెప్పిన  ఆచిన్నారిని  అడిగాడు "నీవు ఇంత చిన్న పిల్లాడివి.ఒంటె మెడను నరికేయగలవా?"  "ప్రభూ!నేను రాజస్థాన్ కి చెందిన బాలుడిని. బలంఉన్నవాడిని"అంటూ అక్కడే ఉన్న ఓభటుని ఒరలోని ఖడ్గాన్ని లాగి అక్కడే ఉన్న ఒంటెమెడను నరికి"ఇప్పుడు తెలిసిందా నాసత్తా?నన్ను చంపి మా నాన్నను విడిచి పెట్టండి "అన్న  ఆసాహసబాలుడు వీర దుర్గాదాస్ రాఠౌడ్!చరిత్ర ప్ర సిద్ధికెక్కిన వీరుడు!


కామెంట్‌లు