*వెలుగుల విజయం!*--డా.పి.వి.ఎల్.సుబ్బారావు.
 *దీపావళి శుభాకాంక్షలతో*
      ----------------------
1.ప్రయత్నిస్తే అమావాస్య,
              అంధకారం దూరం!
   ఇంటింటా వెలుగుల,
             తోరణాల సంబరం!
   విజయధ్వానాలతో,
     ప్రతిధ్వనిస్తున్న అంబరం!
  దీపం వెలిగిస్తే చిక్కని,
         చీకటి మటుమాయం!
  అలుపు లేని ప్రయత్నంతో,
   జీవితాన విజయం ఖాయం!
2.పండగంటే మనుషులే కాదు,
    మనసులు కూడా కలవాలి!
మనసులు కలిసిన మనుషుల,
              కళ్ళే దివ్యజ్యోతులు!
 అవి విచ్చిన అరవిందాల్లా,
  ఆనందాలు వెదజల్లే,
                    ఆరనిజ్యోతులు!
  ఆత్మశాంతికి నెలవైన,
                     పరంజ్యోతులు!
3.ప్రతి భామ సత్యభామై,
         శౌర్యంతో  విక్రమించాలి!
    నరకాసుర రూప,
         నరసంహారం కావించాలి!
   అంధకారాన్నే కాదు,
     దుష్షత్వాన్ని దునుమాడాలి!
   సమాజాన సర్వత్రా,
     శాంతిదీపాలు వెలిగించాలి!
4.అష్టలక్ష్మీ ప్రార్థన చేయాలి,
      అష్టఐశ్వర్యాలు పొందాలి!
   సద్గుణాలపునాది ఆదిలక్ష్మి,
      అన్నప్రదాయి ధాన్యలక్ష్మి!
ఆపదలోధైర్యమిచ్చే ధైర్యలక్ష్మి,
        గజఠీవి నొసగే. గజలక్ష్మి!
వంశవృద్ధిసాగించే ,
                     సంతానలక్ష్మి,
విజయసిద్ధి మూలం,
                     విజయలక్ష్మి!
దారిద్ర్యాపహారిణి ధనలక్ష్మి,
     అవిద్యానాశిని విద్యాలక్ష్మి!
అష్టఐశ్వర్యాల సమాహారం,
        జీవితాన తృప్తి కారకం!

కామెంట్‌లు
Unknown చెప్పారు…
పండగంటే మనుషులేకాదు మనసులూకలవాలి ,అక్షరసత్యం
పరంజ్యోతులు అన్నప్రయోగం పరమార్ధమేఅది తెలిస్తే గ్రహిస్తే ఇంకఅనర్ధాలెందుకొంటాయి.చాలాబావుంది.సత్యప్రతిపాదన, వర్ణనతోపాటు సందేశాత్మకంగాఉంది.ప్రణామములు.
శ్రీరామమూర్తి (రాంబాబు)