ధర్మ పరిరక్షణకు కన్నబిడ్డను సైతం హతమార్చిన సత్యభామ లీలలు ఈ దీపావళి...
నేడు పిల్లలను అతిగారాభం చేసి కోరినదల్లా కష్టం తెలియకుండా సమకూర్చుతున్నాము ఇరవైఏళ్ళు వచ్చినా గోరుముద్దలు తినిపిస్తున్నాము అయినా కొంతమంది పిల్లలు చెడుదారులలో నడుస్తున్నారు..
అమ్మను కానకుండా తప్పుడు పనులు చేస్తూ !తల్లి దగ్గర అబద్దపు మాటలు... పిల్లలు ఏది చెప్పిన నమ్మి వారికి తానతందానా అంటూ వారిని దేనికీ కొరగాని కొయ్యలను చేసే ప్రేమ మానసిక దౌర్భల్యం ...
చిన్నప్పటి నుంచి మంచి అలవాట్లు , మంచి ఆరోగ్యంపై అవగాహన ,
మన సాంప్రదాయ విలువలు , పెద్దలపై గౌరవం
ఈ విలువలతో పెంచటం జీవిత ధ్యేయంగా పెట్టుకోవాలి ...
పిల్లలు ఎదిగి వారి జీవితం వారు నడుపుకుంటున్నాక
పెద్దల్లోకూడ మార్పూ రావాలి మనం మనకోసం
జీవితం అనుకొని ఇతరులకు సాయంచేయటం . యాత్రలకు నలుగురితో కలసి వెళ్ళడం , మంచి ఆహారం తీసుకోవడం , ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకోవడం మన ధ్యేయం కావాలి ...
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి