బ్రతుకుబాట ..!!> సాగని చదువు.;-కోరాడ నరసింహ రావు >విశాఖపట్నం.

  నా గ్రహచార పీడన... నాబాల్య మంతా... వెంటాడుతూనే ఉంది ! పంతులుగారు చెప్పినట్టే... నాతండ్రి కి పెద్ద ప్రమాదమే జరిగింది ప్రాణాలైతే పోలేదు గానీ... రెండు గోలీ షోడాలు ఒకేమారు పేలిపోయి 
గాజుపెంకులు రెండు దవడల్నీ చీల్చుకుని గాజుపెంకులు లోనికి వెళిపోయాయట !అప్పటివరకూ సంపాదించిన డబ్బు, బంగారము అన్నీ హరించుకుపోతేనేగానీ ఆయన ప్రాణాలు దక్కలేదట !!
నాకు ఊహ తెలిసి... నేను పడ్డ శారీరక రోగ బాధలు ఇన్ని-అన్ని  అని చెప్పలేనన్ని...  ఓమారు కాలుకాలి..మరోమారు చెయ్యి  విరిగి,ఇంకోమారు చెవిలో గొంగళి పురుగు దూరి....కళ్ళు అంటుకుంటూ...
విప్పేప్రయత్నం చేస్తేచీము -నెత్తురు కారుతూ... నాకళ్ళు పోతాయనే అనుకున్నారట... !
ఓ సారి దీపావళి రోజు పేలిన బాంబు నాతల మీద పడి... 
పెద్దగాయమై... పురుగు పట్టీ సిందట.... పగవారికి కూడా ఆ దేవుడు ఇన్నిన్ని కష్టాలు పెట్టకూడదు కదూ !
నా ఇన్నిబాధలకూ నాకంటే ఎక్కువ శ్రమించింది, బాధపడింది మా అమ్మే... అందుకే తల్లిని మించిన దైవం లేదని పెద్దలు చెబుతారు అనిపించింది నాకు... !
తినే తిండికీ, కట్టే బట్టకీ,ఉండటానికి ఇల్లు కోసం కూడా ఎన్నికష్టాలు పడ్డామో... 
ఎన్ని పూటలు పస్తులున్నామో 
ఎన్ని అద్దెయిల్లు మారామో లెక్కే లేదు... !
  నాతల మీద కాలిపోటం మూలానేమో బుర్ర సరిగ్గా పని చేసేది కాదు... స్కూల్ లో పాఠాలు బోధపడేవి కావు !
మాక్లాస్ సిస్టరైతే... మీబుర్రల్లో ఆ దేవుడు మెదళ్ళకు బదులు 
పేడ ముద్దలు పెట్టాడ్రా.. అని 
తిట్టేవారు ! ఐదవతరగతి వరకూ...కేవలం చదవటం రాయటం మాత్రమే వచ్చిందని చెప్పాలి ! 
అక్కడినుండి ఆరవ తరగతిలో జాయినయి... మూడుమాసాలు కాకముందే 
మళ్ళీ రోగాలు దాడిచె య్యటం 
మొదలు పెట్టాయి డబుల్ టైఫాయిడ్...ఓవైపు...దీనికితోడు నాలుగుమార్లు గజ్జికురు పులు...! డాక్టరు సెర్టిఫికెట్ తో 
ఏడవతరగతికి ప్రమోట్... !
 తీవ్రమైన ఆర్ధిక ఇబ్బందులు !!
ఇంక చదువు సాగటం లేదు ...
ఆఖరికి స్కూలు బాట విడిచి 
సారా దుకాణం ముందు మసాలా శనగలు...గారెలు అమ్ముతూ కొన్నాళ్ళు... !!
*********************
...........సశేషం

కామెంట్‌లు
డా కె.ఎల్.వి.ప్రసాద్ చెప్పారు…
మీ బతుకుబాట బాగా సాగుతోంది. అభినందనలు
Unknown చెప్పారు…
బాగుంది, సర్!
Unknown చెప్పారు…
బాగుంది, సర్!