*మనమూ ఇవ్వగలం*;- *సునంద వురిమళ్ల, ఖమ్మం*

  *అవును మనమూ ఇవ్వగలం*
*మన దగ్గర ఏమున్నాయి* .*ఇవ్వడానికి అనుకుంటారు చాలా మంది.*
 *ఆస్తులు అంతస్తులు లేకపోయినా మనమూ ఇవ్వగలిగేవి  ఉన్నాయి .*
*అవే ఆప్యాయత, అనురాగం, అభిమానం, అభినందన , ఆత్మీయమైన గౌరవం.*
*ఇవ్వాలనే తపన ఉండాలే కానీ*
*ఈ ఐదే కదా  అమూల్యమైన  సంపదలు.*
*వీటి కోసం ఆర్తిగా అర్రులు చాచే వారెందరో ఉన్నారు.* 
*వీటిల్లో ఏ కొంచెం ఇచ్చినా ,పంచినా వారిలో పొందామనే సంతోషం*.*మనమూ ఇవ్వగలిగామనే సంతృప్తి అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తుంది.*
 *సుప్రభాత కిరణాల నమస్సులతో 

కామెంట్‌లు