తీపి-చేదు! అచ్యుతుని రాజ్యశ్రీ

 కుంతల రాజుకి  ఒక అనుమానం వచ్చింది. సభలో అడిగాడు "అన్నిటికన్నా  తీపి అతిచేదు ఐంది ఏది?" ఓష్ ఇదేం పిచ్చిప్రశ్న అని అంతా నోటి కి వచ్చింది చెప్పసాగారు."ఇష్టమైన పండు మిఠాయి "అని కొందరు "తల్లిదండ్రుల ప్రేమ పిల్లల ముద్దుమురిపాలు"అన్నారు కొందరు. మనకు నచ్చని వస్తువు వ్యక్తి చేదుదోస వేపాకు అని రకరకాల జవాబులు ఇచ్చారు. కానీ అనంతుడు మాత్రం "ప్రభూ!మనమాట నాలుక యే చేదు తీపి!"అని ఠపీమని జవాబు ఇచ్చాడు.రాజుతో సహా ఎవరికీ ఆమాట నచ్చలేదు. "దాన్ని నిరూపించగలవా?" "అలాగే ప్రభూ! నాకు రెండు రోజుల వ్యవధిఇవ్వండి."   మూడోరోజు జీబురుగడ్డం అట్టలుకట్టిన నెత్తి చిరిగిన దుస్తులలో రాజదర్బారు ముందు అనుమానాస్పదంగా తిరుగుతున్న ఓ వ్యక్తిని  భటులు లాక్కుని వచ్చారు సభలోకి. రాజుని చూస్తూ నే వికటంగా కిసుక్కున నవ్వు తూ వెర్రివాడిలాగా పళ్లికిలిస్తూ అరిచాడు "దండాలు మహాప్రభో!ఒకప్పుడు  మంచి జ్యోతిషపండితుడిని. నేను చెప్పే ప్రతిదీ నిజం అయ్యేది. అదే నన్ను  ఇలా బికారిని చేసింది." "అదేంటి?"కోపంగా  మంత్రి అరిచాడు. "బాబయ్యా! నేను గద్దెపై కూచున్న మారాజుతో మాటాడుతాఉంటే   మద్దెలో నీవెందుకు కల్పించుకుంటావు? అవునులే!నిజం చెప్పితే ఎవరికీ నచ్చదు.ఈపిచ్చి మారాజు ప్రజల కష్టసుఖాలు రాజ్యపాలన గూర్చి ఆలోచించకుండా  వెర్రిమొర్రి తలాతోకా లేని ప్రశ్నలువేయటం వల్ల లాభం ఏంటి? ఒంట్లో ఓపిక సత్తా ఉన్నప్పుడే  మంచి పనులు చేస్తూ దైవధ్యానంలో మునగాలి. " అంతే! రాజు కి ఒళ్ళు మండింది. "ఒరే పిచ్చి వెధవా! నీనోరు మూయిస్తా! నాలుగు తగిలించండి వీడికి"అని అరిచేప్పటికి భటులు అతన్ని కొట్టడానికి కొరడాలతో సమీపించారు. వెంటనే ఆవెర్రివాడు "ప్రభూ!ఇదే చేదువిషం! అదే మన నాలుక! మీకు నాకు మనకు నచ్చని మాట వాక్యం చేదువిషం తో సమానం!"అంటూ తన గడ్డం జీబురుజుట్టు అన్నీ పీకి కింద పడేశాడు. ఆశ్చర్యం!అతను అనంతవర్మ! మంచితనం మూర్తీభవించిన రాజుకి ఇష్టమైనవాడు."ఇదేంటి అనంతా?"మంత్రి తెల్లబోయాడు. " చిత్తం మంత్రివర్యా! రాజుగారి తో రెండు రోజులలో ఆయన ప్రశ్నకు జవాబు ఇవ్వడానికే ఈనా వెర్రివాడి వేషం! నాఇష్టం వచ్చినట్లు రాజుని  నిందించాను.దానికి చేదుశిక్ష  కొరడాదెబ్బలు! ప్రభూ! మిమ్మల్ని నిందించేంత శక్తి సామర్ధ్యాలు నాకెక్కడివి? మీపాలనలో అందరం సుఖంగా శాంతంగా జీవిస్తున్నాము.ఈమాట మీకు  ప్రజలకు నచ్చుతుంది కదూ!? దీన్ని కూడా  నానాలుకయే పలికింది. కాబట్టి నోరు మంచిదైతే  ఊరు మంచిదవుతుంది అనే సామెత కూడా పుట్టింది. నరం లేని మననాలుక  నష్టాలు కష్టాలు తెస్తుంది. ఇదేఅత్యంత తీపి చేదుని కలిగించేది. " సభంతా చప్పట్లతో మార్మోగింది.
కామెంట్‌లు