చుట్టూ మనుషులే
సందడులే, గలభాలె
కానీ ఏదో తెలీని దిగులు
మనసుని పిండేసే బాధ
సముద్రాన్ని చూస్తే
అలలు నవ్వుతున్నట్టులేదూ
గాలిని చూస్తే
ఈల వేస్తున్నట్టులేదూ
మబ్బులు చూస్తే
పరుగెడుతున్నట్టు లేదూ
పువ్వులు చూస్తే
తలలూపుతున్నట్టు లేదూ
అన్నీ హాయిగానే ఉన్నాయి
నాలో ఎందుకీ మౌనం
తీరని ఏదో వేదన
రోజులు దొర్లిపోతున్నాయి
కాలం పరిగెడుతూవుంది
నా పాదాలు మాత్రం
కదలనంటున్నాయి
ముసిరిన ఆలోచనలు
వదలనంటున్నాయి
ఏదో చిన్నపాటి భయం
ఆణువణువూ నిండి పోతూవుంది
నిరాశ మేఘాలు
కమ్ముకొంటున్నాయి మనసులో
ఏదో రాసేద్దామని తపన
అదేదో అతకని బతుకులో
కుదరని రాతలా భావాలు
మన అదుపులో లేని
జీవితంపై లాలస ఎందుకు
నిర్లిప్తత దీనికి జవాబా
ప్రశ్నించడమే తెలుసు
సమాధానం వెతకాలి
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి