కందం:
*కరకర నములుటయందును*
*బరపరయగునెపుడు చురుకు వ్రాఁతలయందున్*
*జురచుర కాలుటయందును*
*గొరకొరయగు గోపదృష్టి గువ్వలచెన్నా!*
తా.:
మనుషులు నమిలేడప్పుడు కర కర మని శబ్దము వస్తుంది. చేతితో కాగితం మీద వేగంగా రాసే డప్పుడు బర బర మని శబ్దం వస్తుంది. ఏదైనా వస్తువు మంటల్లో కాలుతున్నప్పుడు చుర చుర మని మంటల శబ్దం వస్తుంది. కోపంగా చూస్తున్నప్పుడు చుర చుర చూస్తున్నారు అంటాము.......అని శతక కారుడు *"పట్టాభిరామ కవి - గువ్వలచెన్నుని "* వాక్కు.
*భావం:*
*ఈ పద్యంలో పట్టాభిరామ కవి తనలోని సరదా కోణంతో పాటు వేరు పనులు చేసేడప్పుడు వచ్చే శబ్దాల చిత్రం మనకు పరిచయం చేసారు.*
..... ఓం నమో వేంకటేశాయ
Nagarajakumar.mvss

addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి