అపాయంలో ఉపాయం; -విస్లావత్ సావిత్రి నేరళ్లపల్లి.బాలానగర్.మహబూబ్ నగర్. జిల్లా701326446

 అనగనగా సిరిపురం అనే ఊరు ఉండేది.ఆ ఊరిలో శివయ్య అనే వ్వక్తి ఉండేవాడు. ఏడు మేకలు ఉండేవి. మేకలను మేపుతూ ఉండేవాడు. 
ఒక రోజు మేకలను మేపి అలసి పోయి ఒక చెట్టు కింద గాఢ నిద్రలో పడుకున్నాడు. అలామేస్తుండగా ఒక మేక దారి తప్పి అడవి దగ్గరలోని ఒక చెరువు దగ్గరకి వెళ్లింది. చెరువులో నీరు తాగడానికి వెళ్తున్న మేకను చెరువు పక్కనచెట్టు కింద ఉన్న సింహం చూసింది. ఈరోజు రుచికరమైన ఆహారం దొరికిందనుకుంటూ సింహం
 మేక మీదకు వచ్చింది. మేక తప్పించుకోబోయింది.కానీ మేక వెనుకకాలు సింహానికి దొరికింది. అప్పుడు మేకకు ఏం చేయాలో అర్థం కాలేదు. అంతలోనే మేకకు ఒక ఉపాయం తట్టింది.  అప్పుడు ఆ మేక అరవకుండా,ఏడ్వకుండా  నవ్వసాగింది. 
మేక ఎందుకు నవ్వుతోందో సింహానికి అర్థం కాలేదు.
"పిచ్చి మేకా! నువ్వు ఎందుకు నవ్వుతున్నావ్?" అని ప్రశ్నించింది సింహం.
"నా కాలులో ముల్లు ఉంది. కొరికితే నీగొంతులో దిగుతుంది"అంది మేక.
సింహం వెంటనే మేక కాలును విడిచి పెట్టి గొంతు పట్టుకోబోయింది.
  కాలు విడిచిన వెంటనే, కన్ను మూసి తెరిచేలోగా సింహానికి దొరకకుండా పరుగెత్తి పోయింది మేక.తన తెలివితేటలతో ఆపదనుండి బయటపడి అడవిలో దారి వెతుక్కుని,తనమిత్రుల గుంపులో చేరింది మేక.జరిగిన విషయం వాటికి చెప్పింది. సమయస్ఫూర్తితో
 సింహం నుండి ప్రాణాలు దక్కించుకున్న మేకను దాని మిత్రులు ప్రశంసించాయి.

కామెంట్‌లు