చరవాణి.;-జటావత్ మునినాయక్ - నల్గొండ (జాల్ తండా )చేరవాణి :- 7659888655

 అరచేతిలో ప్రపంచాన్ని చూపుతూ 
అందరి జీవితాలను నాశనం చేస్తున్న మేధావి చేరవాణి 
దూరంగా ఉన్న స్నేహాలను దగ్గర చేస్తూ దగ్గరున్న స్నేహాలను దూరం చేస్తూ 
చెంతనే ఉన్న చెవికెక్కని జనవాణి 
పరాయివాళ్ళు పక్కప్రక్కనే ఉన్నా
యంత్రాన్ని ప్రేమించే పిచ్చివాళ్ళను చేసింది వ్యసనపరులుగా మార్చింది.
ప్రమాదవశాత్తు పడిపోయినా...
"ప్రాణం ఉందోలేదో చూసుకోకుండా
"ఫోను"ఉందో లేదో చూసుకునే స్థాయికి దిగజార్చింది.
ఎన్నని చెప్పను దీని లీలలు
ప్రమాదవశాత్తు పడిపోయినా...
"ప్రాణం ఉందోలేదో చూసుకోకుండా
"ఫోను"ఉందో లేదో చూసుకునే స్థాయికి దిగజార్చింది
ఓ మిత్రమా...!విజ్ఞానం కోసం చేసింది అజ్ఞానంగా వాడకు
ఊడిగం చేయించుకో...
అంతేగాని బానిసగా మారకు.
బి కేర్ ఫుల్ అది మాయల మహరాణి
వ్యసనాల యువరాణి
చేతిలోని చరవాణి.

కామెంట్‌లు