తెలుసుకో సోదరా!;-యలమర్తి అనూరాధహైద్రాబాద్9247260206
 కొందరుంటారు 
కళ్ళు ఉండీ గుడ్డివాళ్ళలా
ఎంత మూర్ఖత్వమంటే
వాళ్ళకు వాళ్లే
గొప్ప వాళ్ళమనేంత
ఎదుటి వారంతా చెడ్డవారని 
తామే మంచివారమనే భ్రమలోనే 
అనుక్షణం
తోక ఒక్కటే తక్కువ
అన్నీ కోతి పనులే
రెడ్&వైట్ రెడీ టూ ఫైట్ లా
ఎప్పుడూ కయ్యానికి కాలు దువ్వుతూనే 
పోట్ల గిత్తలును మరపిస్తూనే
నక్కలా పొంచి ఉంటూ
జిత్తులు పన్నుతూఉంటారు
ఈ స్వభావం ఎప్పుడూ చెరుపే
వైనం మార్చుకోవాలి 
అందరూ సఖ్యతగా మనగలగటమే 
సమాజానికి మనిషికీ శ్రేయస్కరం!

కామెంట్‌లు
Dr గౌతమ్ కశ్యప్ చెప్పారు…
చాలా కరెక్ట్ గా చెప్పారు. అదో శునకానందం కొందరికి. ఆ శాడిజం తో ఏవిటి సాధిస్తారో ఏవిటో మామనుషులను కొల్పవడం తప్ప! - డా. gautham kashyap, హైదరాబాద్