అలెగ్జాండర్ ఫ్లెమింగ్.;-తాటికోల పద్మావతి గుంటూరు.

 చిన్న గాటు, సూది గుచ్చుకున్న వెంటనే సెప్టిక్ అవ్వకుండా పెన్సిలిన్ ఇంజక్షన్ చేయించుకోమని సలహా ఇస్తారు డాక్టర్లు. ఆ పెన్సిలిన్ ఎవరు కనుగొన్నారు తెలుసుకుందాము.
అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 18 81 లో స్కాట్లాండ్ లో జన్మించారు లండన్లో చదువుకున్నాడు. 19 0 6 లో అక్కడే డిగ్రీ తీసుకున్నాడు. కొంతకాలం దూరమై మొదటి ప్రపంచ యుద్ధం తర్వాత అదే కాలేజీకి వచ్చి ఆంటీబయాటిక్ మీద పరిశోధనలు చేశారు. పెన్సిలియం అనే ఫంగస్ నుండి ఇ పెన్సిలియం వస్తుందని దానికి బాక్టీరియా ఇతర అ సూక్ష్మజీవులను నిర్మూలించే గుణం ఉన్నదని ప్రయోగపూర్వకంగా గుర్తించారు. రెండవ అ ప్రపంచ యుద్ధకాలంలో ఈ పెన్సిలిన్ ఎందరో రోగాల బారిన పడిన సైనికుల్ని రక్షించింది. 19 41 లో ఫ్లెమింగ్ అమెరికా వెళ్లి పెన్సిలిన్ ని నిల్వ చేసే విధానం పై నిపుణులతో సంప్రదించగా అతడి కలలు ఫలించాయి ఈ పెన్సిలిన్ ని గాయాలకు, సుఖ వ్యాధులకు వాడుతున్నారు. దీనివల్ల శరీరంలో చేరిన బ్యాక్టీరియా ఇతర సూక్ష్మజీవులు నశించి రోగి రక్షింపబడ్డాడు. సర్వరోగ అ నివారిణి అయినా పెన్సిలిన్ కనుగొన్నందుకు ఈయనకు 1945లో నోబుల్ బహుమతి రాగా ఆ తర్వాత పదేళ్లకు 19 55 లో లండన్లో మరణించాడు. పెన్సిలిన్ అవసరం ఉన్నంతకాలం ప్రపంచానికి ఫ్లెమింగ్ చిరస్మరణీయుడు. పెన్సిలిన్ ఇంజక్షన్ చేయించు కొన్నప్పుడల్లా అలెగ్జాండర్ ఫ్లెమింగ్ గుర్తుకు వస్తారు. అంతటి గొప్ప మహా వ్యక్తిని పెన్సిలిన్ ఉన్నంతకాలం ఫ్లెమింగ్ కూడా బతికి ఉన్నట్లే.
కామెంట్‌లు