బాధ్యత
*******
తప్పని సరిగా నెరవేర్చ వలసిన నైతిక విధినే బాధ్యత అంటారు. నిబద్ధత, శక్తి సామర్థ్యాలపైనే బాధ్యత ఎక్కువగా ఆధారపడి ఉంటుంది.
వ్యక్తిగా ఉండే బాధ్యతలు మనల్ని సక్రమంగా పనిచేసేలా పురికొల్పుతాయి.
వ్యక్తిగతంగానే కాకుండా కుటుంబ పరంగా, సామాజికంగా నిర్వర్తించాల్సిన బాధ్యతలు కూడా ఉన్నాయి.
వాటి సక్రమమైన నిర్వహణ లోనే మన గౌరవ మర్యాదలు ఆధారపడి ఉండటమే కాకుండా,ఇతరులకు
స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయి.
ప్రభాత కిరణాల నమస్సులతో 🙏
సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి