అభిరుచి
*******
సంతోషం కోసం చేసే ఇష్టమైన పనే అభిరుచి.
అభిరుచి ఆనందానికి హేతువు ప్రశాంతతకు ధాతువు.ఆరోగ్యానికి సేతువు.
నిత్య జీవితంలో వృత్తి,ఉద్యోగ రీత్యా చేసే విధుల వల్ల కలిగే ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి అభిరుచి ఎంతగానో ఉపయోగపడుతుంది. దీనివల్ల మనసు ఎప్పటికప్పుడు నూతన ఉత్తేజం పొందడమే కాకుండా శారీరక మానసిక అలసట తగ్గుతుంది. ఓ ప్రశాంతత మనసును ఆవరిస్తుంది.
కొందరి వినూత్నమైన అభిరుచులు నూతన ఆవిష్కరణలకు దారితీసేలా ఇతరులకు ఆకర్షణీయంగా, స్ఫూర్తి దాయకంగా ఉంటాయి.
ఓ మంచి అభిరుచి స్వంతానికి, సమాజానికి లాభదాయకం
ప్రభాత కిరణాల నమస్సులతో🙏
సునంద భాషితం;- వురిమళ్ల సునంద, ఖమ్మం
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి