సహకారం;-శ్రీ సుధ కొలచన
సాహితీ బృందావన జాతీయ వేదిక
ప్రక్రియ: సున్నితం
రూపకర్త:: నెల్లుట్ల సునీతగారు
-----------------------
మూడుపదాల మచ్చటగు పాదాలు
నాలుగైన పాదాల అంత్యానుప్రాసలు
నవనవీన ప్రక్రియిది అద్భుతంబులు   
చూడచక్కని తెలుగు సున్నితంబు!! 1

పరస్పర అవగాహన 'సహకారము', 
ఇరుపక్షంబుల నడుమ అంగీకారము, 
విధాత లిఖించిన జీవనసారము,
చూడచక్కని తెలుగు సున్నితంబు!! 2

సమస్తసృష్టి యొక్క నియమమిది, 
సమతుల్యత సాధ్యపరచు సాధనమది,
తారతమ్యతలు తావివ్వని తర్కమది, 
చూడచక్కని తెలుగు సున్నితంబు!! 3

అహంకారానికి అంతం అది,
మమకారానికి మూలం అది,
జీవితపు పరమార్థం అది,
చూడచక్కని తెలుగు సున్నితంబు!! 4

అనుబంధాలు పదిలపర్చు సన్నిధది,    
మానవత్వ పరిమళమిచ్చు సుమమది,  
వసుధైక కుటుంబానికి పెన్నిధది, 
చూడచక్కని తెలుగు సున్నితంబు!! 5

ఆలుమగల నడుపుతున్న సంసారం -
సహకారానికది నిలువెత్తు  ఆకారం,
సుఖమయ జీవనానికి ఆధారం,
చూడచక్కని తెలుగు సున్నితంబు!! 6
 ------------------------------------------


కామెంట్‌లు