సాహితీ బృందావన జాతీయ వేదికప్రక్రియ: సున్నితంరూపకర్త:: నెల్లుట్ల సునీతగారు-----------------------మూడుపదాల మచ్చటగు పాదాలునాలుగైన పాదాల అంత్యానుప్రాసలునవనవీన ప్రక్రియిది అద్భుతంబులుచూడచక్కని తెలుగు సున్నితంబు!! 1పరస్పర అవగాహన 'సహకారము',ఇరుపక్షంబుల నడుమ అంగీకారము,విధాత లిఖించిన జీవనసారము,చూడచక్కని తెలుగు సున్నితంబు!! 2సమస్తసృష్టి యొక్క నియమమిది,సమతుల్యత సాధ్యపరచు సాధనమది,తారతమ్యతలు తావివ్వని తర్కమది,చూడచక్కని తెలుగు సున్నితంబు!! 3అహంకారానికి అంతం అది,మమకారానికి మూలం అది,జీవితపు పరమార్థం అది,చూడచక్కని తెలుగు సున్నితంబు!! 4అనుబంధాలు పదిలపర్చు సన్నిధది,మానవత్వ పరిమళమిచ్చు సుమమది,వసుధైక కుటుంబానికి పెన్నిధది,చూడచక్కని తెలుగు సున్నితంబు!! 5ఆలుమగల నడుపుతున్న సంసారం -సహకారానికది నిలువెత్తు ఆకారం,సుఖమయ జీవనానికి ఆధారం,చూడచక్కని తెలుగు సున్నితంబు!! 6------------------------------------------
సహకారం;-శ్రీ సుధ కొలచన
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి