"మాతృభక్తి-పద్యాంజలి"!!!;-"సాహితీసన్మిత్ర"కట్టరంజిత్ కుమార్--తెలుగుఉపన్యాసకులుసిద్ధిపేటచరవాణి:- 6300474467
 01.
సీ.
తల్లిదీవెనలెల్లచల్లగానుండిన
ముక్కోటివేల్పులమ్రొక్కుటేల?
తల్లిదీవెనలెల్లచల్లగానుండిన
తీర్థయాత్రలనెల్లదిరుగుటేల?
తల్లిదీవెనలెల్లచల్లగానుండిన
భవబంధములుబాపుబాధలేల?
తల్లిదీవెనలెల్లచల్లగానుండిన
మోక్షమార్గమునకుదీక్షయేల?
(తే.గీ.)
కల్పవృక్షమ్ముతోసరికన్నతల్లి
నిలిచియున్నదిధరలోననీకు,నాకు
తల్లిచరణాలుపూజించుతక్షణంబె
జన్మసాఫల్యమౌగాదెజగతియందు!!!
కామెంట్‌లు