"అ ‌" అక్షర గేయం;-మచ్చ అనురాధసిద్దిపేట9948653223
 అమ్మ మొదటి దైవము
అవనికి వెలుగు అమ్మ
అమ్మ ప్రథమ గురువు రా
అమ్మ ఒడి ప్రధమ బడి
అలకలు తీర్చును అమ్మ
అలుపు లేక శ్రమించును
అణుక్షణము రక్షించును
అడుగులు చక్కగ నేర్పును
అల్లరి జేసిన  మాన్పును
అనురాగాల మూట  అమ్మ
అంతులేని ప్రేమ  జూపు
అమ్మ లేని జన్మ లేదు
అందనంత ఎత్తులోన
అమ్మ స్థానముందిరా 
అమ్మ ఋణం తీర్చలేము
అమ్మ పాదాలకు వందనము.


కామెంట్‌లు