పసిపిల్లలు పరమాత్మునితో సమానులు
ఊయలలో కేరింతలు కొట్టే పసివాడు
ప్రపంచ సాగరాన్ని ఈదడానికి
తపన పడే సంకేతాలు
తప్పటడుగులు వేస్తున్నప్పుడు
ఒడ్డుకు చేరాలని తపన పడేవాడు
నడక నేర్చినపుడు నాన్న చేయి పట్టుకుని
తీరం దాటాలన్న ఆరాటం
అమ్మ చేతి గోరు ముద్దలు తింటూ
ప్రకృతి పరిశీలకుడవుతాడు
ఎదిగే కొద్దీ వేసే ప్రశ్నల్లో
ప్రపంచ జ్ఞానం తెలుసుకున్నంత సంభరం
ఆటలాడేటప్పుడు గెలవాలనే ఉత్సాహం
అక్షరాలు దిద్దుతున్నప్పుడు
మాతృ భాష నేర్చుకుంటున్న ఆనందం
పిల్లలకి విలువలు నేర్పేవారే తల్లిదండ్రులు.
పాఠాలు , గుణ పాఠాలు నేర్పే
వాళ్ళే గురువులు
ఈ లీలలన్నీ చేసే శక్తే దైవం
అందుకే-
అన్నారు తల్లి తండ్రి గురువు దైవం అని.
************
తల్లి తండ్రి గురువు దైవం;-కంచనపల్లి ద్వారకనాథ్7981499423
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి