హోళి ! శివాని కేళి !!;-" రసస్రవంతి " & " కావ్యసుధ " చరవాణి : 9247313488
 శివుని అర్ధ భాగమై
శివాని హెూళి యాడగ
తపోధనుని తనువు నుండి
తన దేహము వేరు చేసి
వసంత పనసీమలలో
హెూళి యాడ హరుని కొరే
తపోనిష్ఠ వీడి శివుడు
అల అల్లన అడుగులేస్తూ
అపర్ణ దిశ సాగుచుండె
ఆమని ఆనంద పడుచు
కుసుమిత సుమాలు జల్లె
మంద గంధ గాలి పొరలు
పరిమళాలు పరిఢవిల్లె
సాలుకు ఒకసారి వచ్చు
హెూళి ఆట నాడు కొనగా
శాంకరి ఉబలాట పడెను
శంకరుడుత్సాహ పడెను
ప్రకృతియే పల్లవించి
సరస సరాగాలు పాడె
పరిసరాలు పులకరించి
పవన తెరలు తేలియాడే
రంగుల రంగేళి లోన
శృంగారం పురులు విప్పి
గౌరీ శంకరు లిరువురి
గంగాజల క్రీడలతో
కైలాస నివాస సమంత
కామకేళి ప్రజ్వరిల్లె
ఇరువురొకరిపైన నోకరు
రకరకముల రంగులొలుక
రంగేళి యాటలు అను
రాగము వర్షింప సాగె
నీలగళుని కౌగిలిలో
నిమిడినట్టి కాత్యాయని
శివుని చెంపలకు రంగుల
సింగారము జేయుచుండె
శివరంజని శిరము బట్టి
ఇరు చంపల ముద్దు బెట్టి
అరచేతుల శ్రీగంధం
అణువణువున అలదు చుండె
ఏమి ! హెూళి  !! ఏమి కేళీ !!
ఎంత మధుర మా విరాళి !!
మరుమల్లెల తెలుపు రంగు
కనకాంబర మెరుపు రంగు
నల్ల కలువ పూల రంగు
చేమంతుల పసుపురంగు
శైలజ పై శివుడి జల్లె
హరుని పైన గిరిజ జల్లె
రంగుల హెూ రంగులు
రసికుల ఎద పొంగులు
ఇరువురి దేహాల నిండా
ఇంపు సొంపు హంగులు
గౌరీ శంకరుల హెూళి !
కేళీ పలు భంగులు !!
యెదలను వుయ్యాలలూపు
మోహన సారంగులు
రంగుల రంగులు
చూపులు కను విందులు.

కామెంట్‌లు