పిల్లల్లారా (బాలగేయం);-- డా.గౌరవరాజు సతీష్ కుమార్.

 పిల్లల్లారా ఎదగాలీ
జ్ఞానులు మీరూ కావాలీ 
పనిలో నాణ్యత పెంచాలీ 
పరిణతి మీరూ చెందాలీ 
ఎంతో ఎత్తున నిలవాలీ
జగాన మీరూ వెలగాలీ
మమతలు అంతట పంచాలీ 
ఆనందాలు నింపాలీ !!

కామెంట్‌లు