బాలగేయం :- * రంగులకేళి * కోరాడ నరసింహా రావు

 హోలీ అంటే రంగుల కేళి !
తెలియునా మీకు పిల్లలూ ?
మనుషుల్లో భావాలకు ప్రతీకలీ  రంగులు !
ఒక్కో రంగూ, మనలోని ఒక్కో గుణానికీ  గుర్తు  !
తెలుపు శాంతానికి, ఎరుపు కోపానికి !
పసుపు శుభానికి, ఆకుపచ్చ విజయానికి !
కాషాయం త్యాగానికి, నలుపు 
విషాదానికి..., ఒక్కో రంగుకి  ఒక్కోభావం !
 మూడు రంగులతో మిల - మిల మెరిసే  మన జాతీయ జెండాను చూడండి !
  మన త్యాగ నిరతికి  ప్రతీక ఆ పైన మిల - మిల మెరిసే కాషాయo...!
మధ్యన తళ - తళ లాడే తెల్లని రంగు, తెలియజెప్పును... మన శాంతి సందేశం !
దిగువన నిండైన ఆ ఆకుపచ్చ 
మెండైన మన  పంటలకూ... 
సాధించాల్సిన  విజయాలకూ 
గుర్తని, మీరు తెలుసుకోండి !
.చెడుదూరమై, మంచి చేరువైన వేళ,అందరూకలసి హుషారుగా  
రంగులుచల్లుకు ఆడండి 
సరదాగా ఈ హోలీ పండుగను  !
ఆనందాలే నిండు గను ... !!
కామెంట్‌లు