అల వైకుంఠపురం;-జీ జీ రావ్;-కలం స్నేహం
ఆడపిల్లలయితేనేం 
మమతల మాగాణులు
తల్లి పెంపకంలో పెరిగే మణిమకుటాలు 
తండ్రి ప్రేమకు వారసులు 
బాల్యంలో ముద్దులొలుకు చిన్నారులు
ఇంటింటా వెలిగే ఆప్యాయత దీపాలు
నట్టింట తిరిగే మహాలక్ష్మీ అంశలు 
కుటుంబానికి శోభను చేకూర్చే పరిమళ సుమాలు 
తల్లి తరువాత అమ్మ గుణ సంపన్నులు 
ఆ ఇల్లు ఆర్ధికలోటు దేశమవచ్చు గాని 
ప్రేమ మమతానురాగాల రాజసౌధం 
అమ్మా నాన్నల అపురూప ప్రేమ మందిరం
పిల్లల కళాకాంతులు వెదజల్లే హిమాలయం 
చందమామ కధల గోరుముద్దల అన్నపూర్ణ హస్తం 
నాన్న గొంతు వినిపించే ఆకాశవాణి నిలయం 
నిత్యం పట్టు పరికిణీల నిండు శోభాయమానం 
అమ్మ గుణం పుణికి పుచ్చుకునే 
ముద్దగుమ్మలు 
ఆప్యాయతలు నిండిన కళ్యాణంతర గనులు 
కడవరకూ గుండెల్లో మోసే పల్లకీలు 
కాదుకాదు ఆయింట ఆర్ధిక లేమి 
ఆడపిల్లలుగ ధనరాశులు కలిగిన అల వైకుంఠపురం


కామెంట్‌లు